ప్రేతాత్మగా సోనూ సూద్ నటన ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఈ సినిమాతర్వాత సోనూ పాపులారిటీతో పాటు టాలీవుడ్ లో ఆఫర్స్ కూడా ఎక్కువయ్యాయి. అరుంధతి సినిమా సోనూ కెరీర్‌కు చాలా హెల్ప్ అయ్యింది. బాలీవుడ్ నటుడు అయిన సోనూ ఈ సినిమాలో తన నటనతో అబ్బురపడిచాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా అరుంధతి. కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సోనూసూద్ విలన్ గా నటించి మెప్పించారు. ప్రేతాత్మగా సోనూ సూద్ నటన ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఈ సినిమాతర్వాత సోనూ పాపులారిటీతో పాటు టాలీవుడ్ లో ఆఫర్స్ కూడా ఎక్కువయ్యాయి. అరుంధతి సినిమా సోనూ కెరీర్‌కు చాలా హెల్ప్ అయ్యింది. బాలీవుడ్ నటుడు అయిన సోనూ ఈ సినిమాలో తన నటనతో అబ్బురపడిచాడు. హీరోయిన్ గా అనుష్కకు ఎంత క్రేజ్ వచ్చింది సోనూ సూద్ కు కూడా అదే రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా కోసం సోనూసూద్ అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అరుంధతి సినిమాను కోడిరామకృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు. ఒళ్ళు గగ్గుర్లు పొడిచే సన్నివేశాలతో ఆద్యంతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో పశుపతిగా సోనూ నటించి మెప్పించారు. అమ్మ బొమ్మాళి.. పిందె పండయిందిగా .. అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఇప్పటికి ఫేమస్
ఇక ఈ సినిమాకోసం కోసం సోనూ సూద్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. అరుంధతి కోసం సోనూసూద్ 20 రోజుల షూటింగ్ కు 18 లక్షలు డిమాండ్ చేశారట. అయితే 20 రోజులకు మించి షూటింగ్ జరిగితే రోజుకు రూ. 25 వేలు ఇస్తానని నిర్మాత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి అన్నారట. అయితే అరుంధతి సినిమా కోసం అనుకున్నదానికంటే ఎక్కువ రోజులే షూటింగ్ చేశారట సోనూసూద్. దాంతో మొత్తంగా అరుంధతి సినిమా కోసం రూ.45 లక్షలు రెమ్యునరేషన్ అనుదుకున్నారట సోనూసూద్.