Gold Silver Prices Today: అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. దీంతో బులియన్ మార్కెట్ పసిడి, వెండి ధరలు మారుతుంటాయి. సాధారణంగా మగువలకు ఇష్టమైన వాటిలో పసిడి ఒకటి..
Gold Silver Prices Today: అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. దీంతో బులియన్ మార్కెట్ పసిడి, వెండి ధరలు మారుతుంటాయి. సాధారణంగా మగువలకు ఇష్టమైన వాటిలో పసిడి ఒకటి.. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్, ఇంకా ఏదో ఒక సందర్భంలో బంగారాన్ని కొంటుంటారు. దీంతో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పుడూ పెరుగుతుంటుంది. అయితే, గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధరలు తగ్గాయి. గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.54,700గా ఉంది. 24 క్యారెట్స్ పది గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.59,670 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,000 తగ్గి 73,000లుగా ఉంది.
పసిడి ధరలు..
ముంబైలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ.54,700, 24 క్యారెట్స్ రూ.59,670గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్స్ రూ.55,050, 24 క్యారెట్స్ రూ.60,050, ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ.54.850, 24 క్యారెట్స్ రూ.59,820, బెంగుళూరులో 22 క్యారెట్స్ రూ.54,700, 24 క్యారెట్స్ రూ.59,670 గా ఉంది. ఇక హైదరాబాద్లో బంగారం ధర 22 క్యారెట్స్ రూ. 54,700, 24 క్యారెట్స్ రూ.59,670, విశాఖపట్నంలో 54,700, 24 క్యారెట్స్ రూ.59,670, విజయవాడలో 54,700, 24 క్యారెట్స్ రూ.59,670 గా ఉంది.
వెండి ధరలు..
ముంబైలో కిలో వెండి ధర రూ.73.000, చెన్నైలో రూ.76,500, ఢిల్లీలో రూ.73.000, ఢిల్లీలో రూ.73,000, బెంగళూరులో రూ.72.000, హైదరాబాద్ లో రూ.76,500, విశాఖపట్నంలో రూ.76.500, విజయవాడలో రూ.76,500లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు గురువారం ఉదయం వరకు నమోదనైవి మాత్రమే.. మళ్లీ మారే అవకాశం ఉంటుంది..