Bapatla district news: బాపట్ల జిల్లా అద్దంకిలో ఖాకీల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. ఇటీవల అద్దంకి సీఐ రోశయ్య రాసలీలల ఆడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మహిళలను వేధించడంతో పాటు మగాడినంటూ అగౌరవంగా మాట్లాడిన ఆడియో టేపులు బయటికొచ్చాయి.
Bapatla district news: బాపట్ల జిల్లా అద్దంకిలో ఖాకీల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. ఇటీవల అద్దంకి సీఐ రోశయ్య రాసలీలల ఆడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మహిళలను వేధించడంతో పాటు మగాడినంటూ అగౌరవంగా మాట్లాడిన ఆడియో టేపులు బయటికొచ్చాయి. తనపై కక్షతోనే ఫేక్ ఆడియోలు సృష్టించారంటూ సీఐ రోశయ్య వివరణ ఇచ్చారు. అయితే ఆడియోను రిలీజ్ చేసింది కానిస్టేబుల్ రాజశేఖర్ అన్న ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే రాజశేఖర్ అరెస్ట్ కావడంతో ఆడియో టేపుల ఘటన మరో టర్న్ తీసుకుంది. సీఐకి సంబంధించిన ఆడియో టేపులు రాజశేఖర్ రిలీజ్ చేశాడని తెలుస్తోంది. అంతలోనే ఓ సచివాలయ మహిళా కానిస్టేబుల్ తనను వేధించాడన్న ఫిర్యాదుతో రాజశేఖర్‌ను అరెస్ట్ చేశారు. జరుగుతున్న వ్యవహారమంతా ఫేక్ అని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు రాజశేఖర్.
మరోవైపు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ బాధిత మహిళ బయటికొచ్చారు. తనతో తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారని.. అంతకుమించి రాజశేఖర్‌తో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు మహిళా కానిస్టేబుల్.. రాజశేఖర్‌పై తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
సీఐ అన్యాయంగా తనను కేసులో ఇరికించారని ఆరోపించాడు రాజశేఖర్.. ఆడియో టేపుల్ని లీక్ చేశాడనే రాజశేఖర్‌పై సీఐ కక్షగట్టారా? ఈ ఆరోపణల్లో నిజమెంత? సచివాలయ మహిళా కానిస్టేబుల్‌తో బలవంతంగా ఎందుకు ఫిర్యాదు చేయించారు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాల్సి ఉంది.
మొత్తానికి అద్దంకి పోలీసుల మధ్య విభేదాలు రోడ్డెక్కడం జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.