అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ గురువారం వైట్‌హౌస్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కి 20వ శతాబ్దానికి చెందిన పురాతన పుస్తక గాలీని అధికారిక బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు అధ్యక్షుడు బిడెన్ .. పాతకాలపు అమెరికన్ కెమెరాను కూడా బహుమతిగా మోడీకి అందజేశారు.
ప్రధాని మోడీ అమెరికా మూడు రోజుల పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. మోడీకి అమెరికా అధ్యక్షులు జో బిడెన్ దంపతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాధి నేతలు అరుదైన ప్రత్యేక పురాతన వస్తువులను, అధికారిక బహుమతులుగా అందించారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ గురువారం వైట్‌హౌస్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కి 20వ శతాబ్దానికి చెందిన పురాతన పుస్తక గాలీని అధికారిక బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు అధ్యక్షుడు బిడెన్ .. పాతకాలపు అమెరికన్ కెమెరాను కూడా బహుమతిగా మోడీకి అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ కూడా జో దంపతులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పురాతన వైభవాన్ని తెలియజేసే అరుదైన వస్తువులను బహుమతులుగా అందజేశారు. రాజస్థాన్ లోని జైపూర్‌కు చెందిన మాస్టర్ క్రాఫ్ట్‌మ్యాన్ రూపొందించిన ప్రత్యేక చందనం బాక్స్ ను, భారతీయుల హస్తకళా వైభవాన్ని తెలిపే విధంగా ఉండే హస్తకళ వస్తువులను, లండన్‌కు చెందిన ఫేబర్ అండ్ ఫేబర్ లిమిటెడ్ ప్రచురించిన ‘టెన్ ప్రిన్సిపల్ ఉపనిషత్తుల ‘ పుస్తకం మొదటి ఎడిషన్ పుస్తకాన్ని ప్రధాని మోదీ అందించారు. అంతేకాదు గణేశ విగ్రహం, కోల్‌కతాకు చెందిన ఐదవ తరం వెండి కార్మికుల కుటుంబం చేతితో తయారు చేసిన దీపాలను జో దంపతులకు కానుకలుగా అందించారు ప్రధాని మోడీ.
ప్రధాని మోడీ బుధవారం అధికారిక పర్యటనలో భాగంగా రెండో విడతగా వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. అమెరికాకు చెందిన మొదటి జంట తమ అతిథితో ఒక నిమిషం పాటు మాట్లాడుకున్నారు.