విజయ్ తుపాకీ సినిమా నుంచి వరుసగా హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు. ఆయన సినిమాలు 100కోట్లు ఈజీగా వసూళ్లను రాబడుతున్నాయి. రీసెంట్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా చేశారు. ఈ సినిమా తెలుగులో సహ తమిళ్ లోనూ మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.
దళపతి విజయ్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి హిట్స్ గా నిలిచాయి. విజయ్ తుపాకీ సినిమా నుంచి వరుసగా హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు. ఆయన సినిమాలు 100కోట్లు ఈజీగా వసూళ్లను రాబడుతున్నాయి. రీసెంట్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా చేశారు. ఈ సినిమా తెలుగులో సహ తమిళ్ లోనూ మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. తెలుగు కంటే తమిళ్ లో బాగా ఆడింది ఈ మూవీ. ఇక ఇప్పుడు లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కు లియో అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారు. లియో టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న లోకేష్ ఇప్పుడు విజయ్ తో సినిమా చేస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గతంలో లియో టైటిల్ సమయంలో రిలీజ్ చేసిన గ్లింమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బ్లడీ స్వీట్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక తాజాగా విడుదల చేసిన లుక్ లో విజయ్ తో పాటు ఓ తోడేలు కూడా కనిపిస్తుంది.
ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు లోకేష్ కానగరాజ్. ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమా కథకు విక్రమ్ సినిమాను లింక్ చేయనున్నారని తెలుస్తోంది.