రీసెంట్ గా తెలుగు సార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ సినిమాలకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వరు. వెంట వెంటనే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తమిళ్ లో స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్న ధనుష్ బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.
ధనుష్ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రీసెంట్ గా తెలుగు సార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ సినిమాలకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వరు. వెంట వెంటనే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తమిళ్ లో స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్న ధనుష్ బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిందీలో పలు సినిమాల్లో నటించారు ధనుష్. అక్కడ రాంజానా, అట్రాంగిరే సినిమాలు చేశారు ఈ టాలెంటెడ్ యాక్టర్. ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమా చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ధనుష్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ధనుష్. గతంలో ఆయన చేసిన రెండు బాలీవుడ్ సినిమాలకు ఈయనే దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేస్తూ వీడియో ను రిలీజ్ చేశారు. తేరే ఇష్క్ మే అనే టైటిల్ తో రాబోతుంది ఈ సినిమా. ఈ వీడియోలో ధనుష్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. పొడుగాటి జుట్టు , గుబురు గడ్డంతో మాస్ లుక్ లో కనిపించారు ధనుష్.
చేతిలో పెట్రోల్ పోసిన సీసా పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఓ గోడపైకి విసరగా ఆ మంటల్లో మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఓ ప్రేమ కథతో తెరకెక్కుతోందని. ఇందులో ప్రేమ విఫలపమైన కుర్రాడిగా ధనుష్ కనిపించనున్నారని అర్ధమవుతోంది. ధనుష్ కు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు ధనుష్ ఫ్యాన్స్ .