Gold Rate Today: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే.?మగువలకు గుడ్ న్యూస్.. గత మూడు రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయ్. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలాంశాలు, దేశీయ మార్కెట్లలో లాభాలు, లాంటివి..మగువలకు గుడ్ న్యూస్.. గత మూడు రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయ్. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలాంశాలు, దేశీయ మార్కెట్లలో లాభాలు, ద్రవ్యోల్బణం లాంటివి బంగారం ధరల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55 వేలు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేలుగా ఉంది. మంగళవారంతో పోలిస్తే రెండింటా రూ. 70 తగ్గింది.ఇక ప్రధాన నగరాల విషయానికొస్తే.. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55 వేలు, 24 క్యారెట్లు రూ. 60 వేలు. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55, 150 కాగా, 24 క్యారెట్లు రూ. 60, 150. బెంగుళూరులో 22 క్యారెట్లు రూ. 55 వేలు ఉండగా, 24 క్యారెట్లు రూ. 60 వేలుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా..
తెలంగాణలోని హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 55 వేలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేలు. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55 వేలుగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60 వేలుగా ఉంది.మరోవైపు వెండి ధరలు భగ్గుమంటున్నాయి. మంగళవారంతో పోలిస్తే.. కేజీ వెండి రూ. 500 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 74 వేలు దగ్గర కొనసాగుతోంది. ఇక హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 78, 600 కాగా, విజయవాడలో కూడా ఇదే రేటు నడుస్తోంది.