Telangana: తెలంగాణ సర్కార్ నయా ప్లాన్.. ఆ ‘గుడ్లు’ ఇక మాయం కావు..!అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ నిత్యం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన గుడ్లు దారిమళ్లుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ నిత్యం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన గుడ్లు దారిమళ్లుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుడ్లు పక్కదారి పట్టకుండా ఉండేందుక.. రంగుల ముద్రలు వేయాలని నిర్ణయించింది సర్కార్. జోన్ నెంబర్ సహా నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులను గుడ్లకు వేసేలా ఏర్పాట్లు చేసింది.అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందజేయాల్సిన కోడి గుడ్లు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల రవాణా, వాటిని లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేందుకు వినూత్న చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రతీ గుడ్డుపై ప్రత్యేక ముద్ర వేసి అందించనున్నారు.
ఎలాంటి అవకవతకలు జరగకుండా విడతల వారీగా ఒక్కో రంగుతో ముద్రను వేసి సరఫరా చేస్తున్నారు. నెలలో పది రోజులకోసారి కోడిగుడ్లపై ప్రత్యేక రంగుతో కూడిన ముద్రను వేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోన్ల పరిధిలో కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. కోడిగుడ్డు కుళ్లిపోతే కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్ట చేసింది.