Andhra Pradesh: హవ్వా.. ఏంటిదీ.. పోలీసులపైనే లైంగిక వేధింపుల కేసు నమోదుచిత్తూరు జిల్లా పూతలపట్టులో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్విహిస్తున్న పోలీసులపైనే లైంగిక కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే గత కొన్నిరోజుల క్రితం కల్లూరు వద్ద భారీ చోరి జరిగింది.చిత్తూరు జిల్లా పూతలపట్టులో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్విహిస్తున్న పోలీసులపైనే లైంగిక కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే గత కొన్నిరోజుల క్రితం కల్లూరు వద్ద భారీ చోరి జరిగింది. అయితే దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పూతలపట్టు ఎస్సై హరిప్రసాద్ తన బృందంతో కలిసి తమిళనాడు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో పూమది, అయ్యప్పతో సహా 6 మందిని అరెస్టు చేశారు. అయితే ముఠాలో నలుగురు నిందుతులు మహిళలే. విచారణ అనంతరం పోలీసులు ఇద్దరిని రిమాండ్కు పంపి మరో నలుగురికి నోటీసులిచ్చి పంపించారు.ఈ ముఠాలో నలుగురు మహిళల్ని ఏపీ పోలీసులు లైంగికంగా వేధించి హింసించారని తమిళనాడులోని క్రిష్ణగిరి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంచో చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డితో కృష్ణగిరి పోలీసులు మాట్లాడారు. ఆ తర్వాత ఎస్పీ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం కృష్ణగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ప్రాథమిక నివేదక ఇవ్వాలని నగరి అర్బన్ సీఐ వాసంతికి ఆదేశించారు. ఈ మేరకు పూతలపట్టు ఎస్సై హరిప్రసాద్, కానిస్టేబుల్ తనికాచలంతో పాటు మరో నలుగురిపై చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.