Chiranjeevi: నీ రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందాన్ని పంచావు.. వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్చరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళై పదేళ్లవుతున్న శుభవార్త ఎప్పుడు చెప్తారా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురు చూశారు. మొత్తానికి చరణ్ వారసురాలు వచ్చేసింది. చరణ్ దంపతులకు పాప పుట్టడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులయ్యారు. ఈ జంట నేడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఫ్యామిలీలోకి మెగా ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి ఆనందంలో తేలిపోతున్నారు. అపోలో హాస్పటల్ లో నేడు ఉపాసన డెలివరీ జరిగింది. చరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళై పదేళ్లవుతున్న శుభవార్త ఎప్పుడు చెప్తారా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురు చూశారు. మొత్తానికి చరణ్ వారసురాలు వచ్చేసింది. చరణ్ దంపతులకు పాప పుట్టడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కంగ్రాట్స్ అన్న వదిన అంటూ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా సెలబ్రెటీలు కూడా చరణ్ , ఉపాసన దంపతులకు విషెస్ తెలుపుతున్నారు. క
తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనవరాలు పుట్టడంతో ఆ సంతోషంను అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్.. నీ రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందాన్ని పంచావు. నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీ మీ తల్లిదండ్రులను ఆశీర్వదిస్తున్నారు. నీ రాక నీ తల్లిదండ్రులు చరణ్, ఉపాసనలతో పాటు.. గ్రాండ్ పేరెంట్స్ అయిన మాకు కూడా సంతోషంగా , గర్వంగా ఉంది అంటూ చిరు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.