Ravi Teja- Sreeleela: రిపీట్ కానున్న క్రేజీ కాంబో.. రవితేజ సరసన మరోసారి లేటెస్ట్ సెన్సేషన్యంగ్ హీరోల దగ్గరనుంచి సీనియర్ హీరోల వరకు అందరితో నటిస్తుంది ఈ చిన్నది. శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిన్నది ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ తో కలిసి ధమాకా అనే సినిమా చేసింది.లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ ఇక్కడ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. యంగ్ హీరోల దగ్గరనుంచి సీనియర్ హీరోల వరకు అందరితో నటిస్తుంది ఈ చిన్నది. శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిన్నది ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ తో కలిసి ధమాకా అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ధమాకా సినిమాతో శ్రీలీల ఖాతాలో మంచి హిట్ పడింది. అటు రవితేజ కూడా చాలా కాలం తర్వాత ధమాకాతో సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవ్వనుందని తెలుస్తోంది.రవితేజ రీసెంట్ గా నటించిన రావణాసుర సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు నాలుగో సారి ఈ కాంబో రిపీట్ కానుందట.ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని టాక్. గోపిచంద్ మలినేని- మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే బాలయ్యతో కలిసి వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. వీరసింహారెడ్డి భారీ విజయం అందుకోవడంతో మైత్రి మేకర్స్ గోపీచంద్ తో ఇప్పుడు సినిమా చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారని తెలుస్తోంది.