Viral Photo: వాటర్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తీసిన వ్యక్తికి షాక్.. డోర్లో నాగుపాము పిల్ల..కిరణ్ అనే ఫ్రిడ్జ్ లోని వాటర్ కోసం తలుపు తీసి చూడగా.. ఫ్రిడ్జ్ డోర్ లోని ఆహార పదార్ధాల మధ్య ఉన్న చిన్న నాగపాముని గుర్తించాడు. అంతేకాదు పాము కూన ఫ్రిడ్జ్ లో ఉంటే.. తల్లి నాగు పాము కూడా సమీపంలో కనిపించడంతో కిరణ్ భయబ్రాంతులకు గురయ్యాడు.
వేసవి కాలం వచ్చిందంటే చాలు అరణ్య వాసాల్లోనూ.. భూమిలో కలుగుల్లోనూ, పొదల్లో పుట్టల్లో జీవించే జీవులు వేసవి తాపాన్ని తట్టుకోలేక వెలుపలికి వస్తాయి. జనావాసాల బాట పడతాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో అత్యంత విషపూరితమైన పాములు ఇళ్ల వద్ద కనిపిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తరచుగా బైక్స్, హెల్మెట్స్, బీరువాలో, షూస్ లో అనేక వస్తువుల్లో పాములు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆహారం, ఆహార పదార్ధాలను నిల్వ చెస్ ఫ్రిడ్జ్ లో పాము పిల్ల కనిపించింది. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన కర్ణాటక లోని మైసూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని ప్రముఖ పట్టణమైన మైసూరులోని రాజ్‌కుమార్ రోడ్డులోని ఓ ఇంటి ఫ్రిడ్జ్‌లో పాము పిల్ల కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. కిరణ్ అనే ఫ్రిడ్జ్ లోని వాటర్ కోసం తలుపు తీసి చూడగా.. ఫ్రిడ్జ్ డోర్ లోని ఆహార పదార్ధాల మధ్య ఉన్న చిన్న నాగపాముని గుర్తించాడు. అంతేకాదు పాము కూన ఫ్రిడ్జ్ లో ఉంటే.. తల్లి నాగు పాము కూడా సమీపంలో కనిపించడంతో కిరణ్ భయబ్రాంతులకు గురయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్ శివకు సమాచారం ఇచ్చాడు. కిరణ్ ఇంటికి వచ్చిన శివ పాముని ఫ్రిడ్జి నుంచి బయటకు తీసి ఒక ప్లాస్టిక్ బాటిల్ లో పెట్టి బంధించాడు. తల్లి పాముని కూడా బంధించి రెండు పాములనురక్షించి సమీపంలోని సురక్షిత ప్రదేశంలో వదిలేశాడు.
ఈ ఫోటోని చూసిన పలువురు రకరాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. పాము కూడా వేడిని తట్టుకోలేక పోతుంది.. అందుకే ఫ్రిడ్జ్ లోకి వెళ్లిందని కొందరు అంటే.. ఫ్రిడ్జిలో ఉన్న ఆహారం తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంకొందరు.. ఇటీవల మైసూరులోని బెళగొళ పారిశ్రామికవాడలో సుబ్రమణ్య ఇంటి సమీపంలో పార్క్ చేసిన బైక్ దగ్గర ఉన్న హెల్మెట్‌లోకి నాగుపాము వెళ్లిన విషయాన్నీ గుర్తు చేసుకుంటున్నారు.