Chandrayaan-3: మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సన్నద్ధం.. చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీహరికోటలో శరవేగంగా ఏర్పాట్లు..భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మరి కొన్ని రోజుల వ్యవధిలోనే కీలక ఘట్టం అవిష్కృతం కానుంది.. అది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగం చేపట్టనుంది. రికార్డు స్థాయి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశ పెడుతూ ప్రపంచ దేశాలను సైతం ఆకట్టుకుంటున్న ఇస్రో.. చంద్రుడి పై మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది.శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల వ్యవధిలోనే కీలక ఘట్టం అవిష్కృతం కానుంది.. అది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగం చేపట్టనుంది. రికార్డు స్థాయి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశ పెడుతూ ప్రపంచ దేశాలను సైతం ఆకట్టుకుంటున్న ఇస్రో.. చంద్రుడి పై మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. అత్యాధునిక టెక్నాలజీతో జులై రెండవ వారంలో LVM-3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి.ఇప్పటికే ఇస్రో హెడ్ క్వార్టర్ అయిన బెంగుళూరులో శాటిలైట్ అనుసంధాన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తయితే చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి జూలై 12న ప్రయోగించేందుకు ప్రయోగ సన్నాహాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు..భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుని పై పరిశోధనలు చేసేందుకు మొట్టమొదటిసారిగా 2008వ సంవత్సరంలో అక్టోబర్ 24 వ తారీఖున 380 కోట్ల రూపాయల ఖర్చుతో ఇస్రో మొట్టమొదటిసారిగా చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టి చంద్రునిపై నీటి జాడలు ఉన్నాయని కనుగొని భారతమాత జెండాను నాటిన సత్తా ఇస్రో చాటుకుంది. అయితే చంద్రుని కక్షపై మరింతగా అన్వేషణలు చేపట్టాలని దాల్చిన ఇస్రో 2019 జూలై 22న జిఎస్ఎల్వీ మార్క్..3 రాకెట్ ప్రయోగం ద్వారా చంద్రుని పైకి రెండవసారి ప్రయోగం చేపట్టి ఆర్బిటర్ సహాయం ద్వారా చంద్రుని కక్షలోకి ప్రవేశపెట్టి అచ్చట నుండి ల్యాండర్‌ను చంద్రగ్రహణం పైకి దింపి ల్యాండర్ నుండి రోవర్‌ను చంద్రునిపై దింపి 14 రోజులు పాటు అన్వేషణలు చేపట్టి చంద్రుని ఉపరితలంపై ఏమి ఏమి నిక్షేపాలు, ఖనిజాలు, లేదా ఏమైనా మౌలిక వనరులు ఉన్నాయో అవి మానవాళికి ఏవిధంగా ఉపయోగపడతాయో ప్రయోగాలు చేయడానికి ఇస్రో చంద్రయాన్..2 ప్రయోగం ను చేపట్టింది. అయితే చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా లునార్ ఆర్బిటర్ సహాయంతో చంద్రుని కక్షలో చేరాక ఇస్రో శాస్త్రవేత్తలు ప్లాన్ ప్రకారమే ఆర్బిటర్ చంద్రుని పై నుండి ల్యాండర్ విడిపోయాయి.. ఆ తర్వాత ల్యాండర్ చంద్రుడు పై కక్ష నుండి చంద్రుడు ఉపరితలం పైకి ప్రయాణం సాగించింది.ల్యాండ్ చంద్రుడు ఉపరితలం పై నుండి రెండు కిలోమీటర్లు ఎత్తున ఉండగానే భూమితో సంబంధాలు తేగిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు నిరాశను మిగిల్చింది, అయితే చంద్రయాన్ 2 ప్రయోగం 90% విజయం సాధించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే చంద్రునిపై నిక్షేపాలును కనుగొనాలని ఇస్రో మరింతగా అన్వేషణ జరపాలని చంద్రయాన్ 3 ప్రయోగాన్ని 2023 జూలైలో కానీ ఆగస్టు మాసంలో కానీ జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ప్రయోగం ద్వారా ప్రయోగం చేపట్టాలని ఇస్రో శ్రీకారం చుట్టింది. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ప్రయోగాలలో ఏయే సాంకేతిక లోపాలు తలెత్యాయో వాటిని సున్నితంగా పరిశీలించింది. గతంలో తలెత్తిన సాంకేతిక లోపాలపై వివిధ రకాల పరిశోధనలు చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు.. ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టనున్నారు.అదేవిధంగా చంద్రయాన్..1 ప్రయోగంలో శాటిలైట్ ను చంద్రుని కక్షపైకి దుకుతూ చంద్రునిపై పరిశోధనలు చేపట్టారు. అదేవిధంగా చంద్రయాన్..2 ప్రయోగంలో మాత్రం అలా కాకుండా చంద్రుని కక్షపైకి లాండర్ ను దింపి లాండర్ లోపల నుండి రోవర్ ను దింపి అక్కడ 14 రోజులు పాటు ఇస్రో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టాలని అనుకున్నారు.. ఇంతలో ఇస్రో దురదృష్టవశాత్తు లాండర్ చంద్రుడు పై దిగే క్రమంలో విఫలమైంది.. ఈ వైఫల్యాన్ని అధిగమించి తిరిగి మరలా చంద్రయాన్..3 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టి చంద్రుని కక్షలో ఎలాంటి వనరులు ఉన్నాయో కనుగొనేందుకు ఇస్రో జూలైలోనే ఈ ప్రయోగం చేపట్టనుంది. దీంతో ప్రపంచ దేశాల దృష్టి మరోసారి భారత్.. అందులోనూ శ్రీహరికోటలోని షార్ కేంద్రంపై పడింది.