Weather Alert: అస్సాంలో చిక్కుకున్న 3 వేల మంది పర్యాటకులు.. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖదేశంలో పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం వల్ల వరదలకు దారి తీశాయి. ఈ వరదల వల్ల దాదాపు 3 వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఇందులో స్వదేశి పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు.దేశంలో పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలోని సిక్కింలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం వల్ల వరదలకు దారి తీశాయి. ఈ వరదల వల్ల దాదాపు 3 వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఇందులో స్వదేశీ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు కూడా విరిగిపడటం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. పలు ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లచుంగ్, లాచెన్ ప్రాంతాలు భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లోనే దాదాపు 3 వేల మంది పర్యాటకులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా భారత వాతావరణ కేంద్రం పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జూన్ 17, 18న రాజస్థాన్, మేఘాలయాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే జూన్ 17 నుంచి జూన్ 20 వరకు త్రిపుర, గుజరాత్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, కేరళలో బారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరఖాండ్, నాగలాండ్, మిజోరాం, మణిపుర్, తమిళనాడు, పుదిచ్చేరి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.