Hyderabad: ఇల్లు ఖాళీ చేయించిందని పగ పెంచుకున్నాడు.. అర్ధరాత్రి బాలిక సహా ఇంటి ఓనర్ దారుణ హత్య..Shadnagar double murder case: కుటుంబంతో సహా ఇంట్లో కిరాయికి చేరాడు.. భార్య భర్తలు నిత్యం గొడవ పడుతూ ఉండటంతో ఇల్లు ఖాళీ చేయమని అన్నందుకు పగతో రగిలి పోయాడు.. ఆ పగతోనే ఇంటీ యజమాని అయిన వృద్ధురాలితో పాటు మనవరాలిని సైతం అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.Shadnagar double murder case: కుటుంబంతో సహా ఇంట్లో కిరాయికి చేరాడు.. భార్య భర్తలు నిత్యం గొడవ పడుతూ ఉండటంతో ఇల్లు ఖాళీ చేయమని అన్నందుకు పగతో రగిలి పోయాడు.. ఆ పగతోనే ఇంటీ యజమాని అయిన వృద్ధురాలితో పాటు మనవరాలిని సైతం అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. హత్య అనంతరం ఇంట్లో ఉన్న బంగారంతో ఉడాయించాడు.. సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో డబుల్ మర్దర్ కేసును ఛేదించారు పోలీసులు. గతంలో ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తే ఈ కిరాతకానికి పాల్పడ్డట్లు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతమ్మ నందిగామ గ్రామంలో అంగన్వాడీలో ఆయాగ పనిచేస్తూ ఉంది. పార్వతమ్మ భర్త ఏడు సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు చనిపోగా మరొక కొడుకు ఎక్కడికో వెళ్లిపోయాడు. పార్వతమ్మ ఒక్కతే తనకున్నటువంటి ఇంట్లో నివాసం ఉంటుంది. మృతురాలు పార్వతమ్మకు ఎవరూ లేనందున తన చెల్లె కొడుకు అయిన కృష్ణయ్య కూతురు భానుప్రియను ఇంట్లో పడుకోవడానికి, తనకు చేదోడువాదొడుగా ఉండటానికి పిలుచుకుంటుంది. అయితే మే నెలలో దివాకర్ సాహు అతని భార్య అంజలితో కలిసి పార్వతమ్మ ఇంట్లో అద్దెకు వచ్చారు. వీరిద్దరూ బీహార్ కు చెందినవారు దివాకర్ సాహు, అంజలి. అయితే, తరచు గొడవ పడుతుండడంతో పార్వతమ్మవారిని ఇల్లు కాలి చేయించింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న పార్వతమ్మ పై పగ పెంచుకున్నాడు దివాకర్.. పార్వతమ్మ ఇంట్లో ఉంటున్న క్రమంలో ఆమెకు ఎవరూ లేరు అని తన దగ్గర డబ్బు, బంగారు ఆభరణాలు ఉన్నట్టు గమనించాడు నిందితుడు దివాకర్..ఇల్లు ఖాళీ చేసిన అనంతరం పార్వతమ్మ ఇంటికి దగ్గరలోనే వేరే ఇంట్లోకి కిరాయికి దిగిన దివాకర్.. పార్వతమ్మ పైన పగ తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు. 16వ తేదీన దివాకర్ ఇంట్లో నుండి అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో కాలకృత్యాలకు వెళుతున్నా అని భారీ అంజలితో చెప్పి పార్వతమ్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడి కాంపౌండ్ కూడా దూకి .. బయట పడుకోని ఉన్న పార్వతమ్మ, ఆమె మనవరాలు భానుప్రియను ఇటుకతో తలపై కొట్టాడు. అనంతరం కత్తితో గొంతు కోసి చంపాడు దివాకర్ సాహూ. అనంతరం బీరువా తాళాలను తీసుకొని రెండు వరసల బంగారు పుస్తెలతాడు, పలు ఆభరణాలను, డబ్బులను ఎత్తుకెళ్లాడు. స్థానికుల సమాచారంతో వెంటనే పరిశీలించిన పోలీసులు ఈ కేసును ఐదు గంటల్లోనే చేధించారు. నాలుగు పోలీసు బృందాలు హంతకుల కోసం జల్లెడ పట్టి బిహారీ దంపతులను పట్టుకున్నాయి. కాగా.. అల్లారు ముద్దుగా పెంచుకున్న భానుప్రియను హత్య చేసిన నిందితులను ఉరిశిక్ష వేయాలని చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టన పెట్టుకున్నాడంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
హత్య చేసిన నిందితుడు దివాకర్ నందిగామ గ్రామ పరిధిలో ఉన్న ఎంఎస్ఎన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు ఆ పరిసర ప్రాంతాల్లో కంపెనీలు ఉండడంతో బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చే వ్యక్తులు ఇక్కడి గ్రామంలో ఇళ్ళను అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు.. ఈ ఘటనతో ఎవరైనా వ్యక్తులకు ఇళ్లను అద్దెకివ్వాలంటే ఇక్కడ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎవరైనా అద్దెకు వస్తే వారి బయోడేటాను ఆధార్ కార్డులను తీసుకోవాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు..