27 బంతుల్లోనే 64 రన్స్.. పెళ్లి తర్వాత మొదటి మ్యాచ్.. భార్య జెర్సీతో బరిలోకి దిగి అదరగొట్టిన రుతురాజ్పెళ్లి తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్‌తో దుమ్మురేపాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (MPL 2023) మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి ఫిఫ్టీ కొట్టాడు. ఈ సునామీ ఇన్నింగ్స్ రుతురాజ్‌కు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇటీవలే తన ప్రియురాలితో కలిసి పెళ్లి పీటలెక్కాడు రుతురాజ్.పెళ్లి తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్‌తో దుమ్మురేపాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (MPL 2023) మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి ఫిఫ్టీ కొట్టాడు. ఈ సునామీ ఇన్నింగ్స్ రుతురాజ్‌కు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇటీవలే తన ప్రియురాలితో కలిసి పెళ్లి పీటలెక్కాడు రుతురాజ్. ఈ వేడుక తర్వాత మొదటిసారి మైదానంలోకి దిగాడు రుతురాజ్. పెళ్లి కారణంగానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు దూరమయ్యాడీ స్టార్ బ్యాటర్. ఆ తర్వాత పుణెరి బప్పా నుంచి కొల్హాపూర్ టస్కర్స్‌తో మ్యాచ్‌లో అడుగుపెట్టి తన బ్యాట్ సత్తా చాటాడు. కేవలం 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టస్కర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. అంకిత్ బావ్నే 57 బంతుల్లో 72 పరుగులు చేశాడు. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పుణెరి జట్టుకు శుభారంభం ఇచ్చారు పవన్ షా, రుతురాజ్. మొదటి వికెట్ కు ఏకంగా 110 పరుగుల జోడించారు. ఇద్దరూ ఫిఫ్టీ కొట్టారు.
గైక్వాడ్ 22 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. గైక్వాడ్ రూపంలో పుణెరికి 110 పరుగులకే తొలి దెబ్బ తగిలింది. 64 పరుగులు చేసి ఔటయ్యాడీ స్టార్ బ్యాటర్. ఆ తర్వాత పవన్ షా, సూరజ్ షిండే జత కట్టి జట్టును విజయ తీరాలకు చేర్చారు. మొత్తానికి 14.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది పుణేరి. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడుగా కనిపించాడు రుతురాజ్. ముఖ్యంగా 7 ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. ఇదిలా ఉంటే ఈమ్యాచ్‌లో గైక్వాడ్ తన భార్య 13వ నంబర్ జెర్సీని ధరించి బరిలోకి దిగాడు. కాగా అతని భార్య ఉత్కర్ష కూడా క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. ఆమె జెర్సీ నంబర్ కూడా 13. ఇక రుతురాజ్ తరచుగా జెర్సీ నంబర్ 31లో కనిపించేవాడు. అయితే ఈసారి మాత్రం జెర్సీ నంబర్ 13తో బరిలోకి దిగి అదరగొట్టాడు.