Avtar Singh: క్యాన్సర్‌తో ఖలిస్థాన్ ఉగ్రవాది అవతార్‌సింగ్ ఖండా మృతియూకే ఖలిస్థాన్ మద్దతుదారుడు అయిన అవతార్సింగ్ఖండా మృతి గురువారం (జూన్ 15) చెందాడు. గత కొంత కాలంగా బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్న అవతార్‌సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యూకేలోని UKలోని బర్మింగ్‌హామ్‌లో ప్రాణాలు కోల్పోయాడు. అవతార్ సింగ్ అనారోగ్యంతో..లండన్: యూకే ఖలిస్థాన్ మద్దతుదారుడు అయిన అవతార్సింగ్ఖండా మృతి గురువారం (జూన్ 15) చెందాడు. గత కొంత కాలంగా బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్న అవతార్‌సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యూకేలోని UKలోని బర్మింగ్‌హామ్‌లో ప్రాణాలు కోల్పోయాడు. అవతార్ సింగ్ అనారోగ్యంతో బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ ఆసుపత్రిలో సోమవారం చేరాడు. ఆరోగ్యం విషమించడంతో శరీరమంతా విషపూరిమై ఈ రోజు మృతి చెందినట్లు సమాచారం. ఐతే అతని మరణానికి గత ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో అవతార్‌సింగ్ చురుగ్గా ఉండేవాడు. గతంలో కొన్ని నిషేధిత సంస్థల్లో అవతార్‌సింగ్ కీలకంగా వ్యవహరించాడు. అవతార్‌సింగ్ తండ్రి కుల్వంత్ సింగ్ ఖుఖ్రానా కూడా ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ ఉగ్రవాదిగా పనిచేశాడు. 1991లో భద్రత దళాల చేతిలో హతమయ్యాడు. కుల్వంత్ సింగ్ ఖుఖ్రానా భార్య కూడా మరో కేఎల్ఎఫ్ఉగ్రవాది గుర్జంత్ సింగ్ బుద్సింగ్ వాలాకు సమీప బంధువని సమాచారం.
కాగా ఈ ఏడాది మార్చి 19న లండన్‌లోని భారత హైకమిషన్ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను ఖలిస్థాన్ అనుకూలవాదులు కిందికి దింపేసి అగౌరవపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో అవతార్‌సింగ్ హస్తం ఉన్నట్లు తేలింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా పంజాబ్పోలీసులు అమృత్‌పాల్ సింగ్ కోసం గాలిస్తున్న సమయంలో, 37 రోజుల పాటు అతను అవతార్ సింగ్ వద్ద తలదాచుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా అవతార్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది.