Cyclone Biparjoy: బిపర్జోయ్ అల్లకల్లోలం.. దూసుకువస్తున్న ముప్పు.. తొమ్మిది రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..Cyclone Biparjoy Alert: బిపర్జోయ్ తుఫాన్ దెబ్బకు అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. భీకర తుఫాన్ తో గుజరాత్ వణికిపోతోంది. ఈ విపత్తుతో ద్వారాకా, సోమనాథ్ ఆలయాలను మూసివేశారు. ద్వారకా ఆలయ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది.Cyclone Biparjoy Alert: బిపర్జోయ్ తుఫాన్ దెబ్బకు అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. భీకర తుఫాన్ తో గుజరాత్ వణికిపోతోంది. ఈ విపత్తుతో ద్వారాకా, సోమనాథ్ ఆలయాలను మూసివేశారు. ద్వారకా ఆలయ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. కచ్ జిల్లా జఖావు రేవు సమీపంలో తుఫాన్ కేంద్రీకృతం అయింది. తీవ్రరూపం దాల్చిన బిపర్జోయ్ దాటికి ముంబై సముద్రం అంతా అల్లకల్లోలలంగా ఉంది. సముద్రం నుంచి నీరు బయటకు పొర్లి వస్తోంది. తీవ్రమైన ఈదురుగాలులతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాతావరణ శాఖ ఊహించినట్లుగానే తుఫాన్ తీవ్రతరం అయింది. కచ్ వైపు బిపర్జోయ్ తుఫాన్ దూసుకువస్తుండటంతో 9 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.బిపర్జోయ్ తుఫాన్ కచ్ తీరం వైపు దూసుకొస్తుందని.. ఇది బీభత్సం సృష్టించే అవకాశముందని అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా గుజరాత్ అల్లకల్లోలంగా మారింది. సాయంత్రం 4నుంచి 8గంటల మధ్య బిపర్జోయ్ తీరం దాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. తుఫాన్ ఊహించని రీతిలో ఉంటే దానికి తగ్గ సహాయక కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని త్రివిధ దళాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు. మరోవైపు సిబ్బంది సన్నద్దతపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.