Rajasthan: ఏడాదిలో 300 రోజులు నిద్రపోయే వ్యక్తి.. స్నానం, తిండి అన్నీ నిద్రలోనే.. కలియుగ కుంభకర్ణుడి గురించి తెలుసా..రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని భద్వా గ్రామంలో నివసించే పుర్ఖారామ్ ని కలియుగ కుంభకర్ణుడుగా పిలుచుకుంటారు. అతనికి యాక్సిస్ హైపర్సోమ్నియా అనే చాలా అరుదైన నిద్ర రుగ్మత ఉంది. ఈ కారణంగా, పుర్ఖారం సంవత్సరంలో 300 రోజులు నిద్రలో గడుపుతాడు.రోజూ నీ జీవితంలో కనిపించే వ్యక్తులను తరచి చూస్తే.. రామాయణ, మహాభారతంలోని క్యారెక్టర్స్ దర్శనమిస్తారు అని పెద్దలు చెబుతారు. ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులను కుంభకర్ణుడితో పోలుస్తారు. రామాయణంలోని రావణాసురుడి సోదరుల్లో ఒకరైన కుంభకర్ణుడు ఆరు మాసాలకు ఒకసారి నిద్ర మేల్కొంటాడు. ఆ రోజంతా తిని మళ్లీ నిద్రపోతాడు. అందుకనే ఎక్కువగా నిద్రపోయేవారిని అపహాస్యం చేస్తూ కుంభకర్ణుడు అని పిలుస్తారు. అయితే ఇప్పుడు కలియుగంలో కుంభకర్ణుడి గురించి తెలుసుకుందాం.. ఈ వ్యక్తి ఏడాదిలో 300 రోజులు నిద్రపోతాడు. అందుకనే ఇతడిని నేటి యుగంలో కుంభకర్ణ అని పిలుస్తారు. ఈ రోజు కలియుగ కుంభకర్ణ గురించి తెలుసుకుందాం..రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని భద్వా గ్రామంలో నివసించే పుర్ఖారామ్ ని కలియుగ కుంభకర్ణుడుగా పిలుచుకుంటారు. అతనికి యాక్సిస్ హైపర్సోమ్నియా అనే చాలా అరుదైన నిద్ర రుగ్మత ఉంది. ఈ కారణంగా, పుర్ఖారం సంవత్సరంలో 300 రోజులు నిద్రలో గడుపుతాడు. సాధారణంగా ప్రజలు రోజుకు గరిష్టంగా 9 గంటలు నిద్రపోతారు. అదే పుర్ఖారామ్ నిద్రపోతే.. ఏక బిగిన 25 రోజులు నిద్రపోతాడు.
పుర్ఖారామ్ నిద్రలోనే స్నానం, భోజనంమానవ మెదడులోని TNF ఆల్ఫా అనే ప్రోటీన్లో హెచ్చుతగ్గుల వల్ల యాక్సిస్ హైపర్సోమ్నియా ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. గత 23 సంవత్సరాలుగా ఇది పుర్ఖారామ్ లో జరుగుతోంది. దీంతో పుర్ఖారామ్ నిద్రలోకి జారుకుంటే అతడిని నిద్ర లేపేందుకు కుటుంబ సభ్యులు మొత్తం కష్టపడాల్సిందే. కుటుంబ సభ్యులే నిద్రలో అతడికి ఆహారం తినిపిస్తారు. స్నానం చేయిస్తారు.
పుర్ఖారామ్కు గ్రామంలో సొంత కిరాణా షాప్ ఉంది. అయితే అతడు అనారోగ్యం కారణంగా నెలలో ఐదు రోజులు మాత్రమే షాప్ తెరవగలడు. ఎందుకంటే పుర్ఖారామ్ ఎప్పుడు ఎక్కడ కూర్చొని నిద్రపోతాడో ఎవరికీ తెలియదు. ప్రారంభంలో పుర్ఖారామ్ రోజుకు 15 గంటలు నిద్రపోయేవాడు.. అప్పుడు అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం ప్రారంభించారు. తర్వాత అతను నయం చేయలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది.
ఎప్పటికైనా వ్యాధి నుంచి బయటపడతాడని ఆశాభావం. కాలక్రమేణా పుర్ఖారామ్ నిద్ర వ్యవధి కూడా పెరగడం ప్రారంభమైంది. గంటల తరబడి నిద్రపోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు రోజుల తరబడి నిద్రపోవడం మొదలు పెట్టాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో ఒక రోజు కచ్చితంగా పుర్ఖారామ్ కోలుకుంటాడని.. తాము మళ్ళీ సాధారణ జీవితం గడుపుతామని పుర్ఖారామ్ భార్య లిచ్మీ దేవి, అతని తల్లి కన్వారీ దేవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు