IND Vs WI: శాంసన్ టీమ్‌మేట్‌కు బీసీసీఐ బంపరాఫర్.. టెస్టుల్లో ఆ సీనియర్ ప్లేయర్‌కి రీప్లేస్.!వరుసగా రెండోసారి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరినా కూడా.. రెండుసార్లు ఓటమిపాలైంది టీమిండియా. ఇక ఇప్పుడు జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటించనుంది రోహిత్ సేన.డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ కల భారత్‌కు చెదిరింది. వరుసగా రెండోసారి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరినా కూడా.. రెండుసార్లు ఓటమిపాలైంది టీమిండియా. ఇక ఇప్పుడు జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటించనుంది రోహిత్ సేన. తదుపరి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా విండీస్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లో జట్టులో కొన్ని పెద్ద మార్పులు కనిపించవచ్చునని సమాచారం.జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బ్యాకప్ ప్లేయర్, యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందట. అతడు మూడో స్థానంలో బరిలోకి దిగే చతేశ్వర్ పుజారాను రీప్లేస్ ఛాన్స్ ఉందని సమాచారం. భారత టెస్ట్ జట్టులో ముఖ్యమైన నెంబర్ 3వ స్థానంలో పుజారా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే అతడు గత కొంతకాలంగా పేలవమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. 2020 నుంచి ఇప్పటివరకు, అతడి బ్యాట్ నుంచి 52 ఇన్నింగ్స్‌లలో 29.69 సగటుతో ఒక సెంచరీ మాత్రమే వచ్చింది. గడిచిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ పుజారా షాట్ సెలక్షన్‌పై తీవ్ర విమర్శలు చెలరేగాయి. సీనియర్ ప్లేయర్ అయి ఉండీ.. బంతి ఎలా వస్తోందో గమనించకుండా.. అలా వదిలేయడమేంటని భారత మాజీ ఆటగాళ్లు మండిపడ్డారు.అద్భుత ఫామ్‌లో జైస్వాల్..
ప్రస్తుతం యశస్వి జైస్వాల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అతడు 14 మ్యాచ్‌ల్లో 48.08 సగటుతో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో సహా 625 పరుగులు చేశాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. కానీ వివాహం కారణంగా వైదొలిగిన సంగతి తెలిసిందే.