Hyderabad: నకిలీ కానిస్టేబుల్ వేషంలో తిరిగిన అమ్మాయి.. చివరికిహైదరాబాద్లో ఓ నకిలీ మహిళా కానిస్టేబుల్ తిరగడం కలకలం రేపింది. ఇన్నాళ్లు నకిలీ ఐడీ కార్డుతో చెలామణి అవుతున్న అశ్విని రెడ్డి అనే మహిళను పోలీసులు ఎట్టకేలకు గుర్తించి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే అశ్విని ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత జల్సాలక అలవాటు పడింది.హైదరాబాద్‌లో ఓ నకిలీ మహిళా కానిస్టేబుల్ తిరగడం కలకలం రేపింది. ఇన్నాళ్లు నకిలీ ఐడీ కార్డుతో చెలామణి అవుతున్న అశ్విని రెడ్డి అనే మహిళను పోలీసులు ఎట్టకేలకు గుర్తించి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే అశ్విని ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత జల్సాలక అలవాటు పడింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు ఓ నకిలీ ఐడీ కార్డును తయారుచేయించింది. ఆ తర్వాత ఆమె ముగ్గురు యువకుల్ని ప్రేమించింది.అలాగే ఆ ప్రేమించిన వారు చోరీలు చేసేలా ప్రోత్సహించింది. పోలీస్ యూనిఫాం అడ్డుపెట్టుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ టోకరా వేసింది. అలాగే అభిషేక్ అనే యువకుడ్ని ట్రాప్ చేసింది. తనను అతను పెళ్లి చేసుకోవట్లేదని ఆసిఫ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరికి అశ్విని నకిలీ కానిస్టేబుల్‌గా తిరుగుతోందన్న విషయాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు.