Khammam Politics: హీటెక్కుతున్న ఖమ్మం జిల్లా రాజకీయాలు.. ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యేతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం ఉంది. ఈ క్రమంలో పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటంతో పలు పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం ఉంది. ఈ క్రమంలో పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటంతో పలు పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎక్కడ ఏ అభ్యర్థిని రంగంలోకి దించాలనే దానిపై ప్రముఖ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. నువ్వా.. నేనా అన్నట్లు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
కొద్ది రోజులు ముందే ఎన్నికల ప్రచార రథాన్ని సిద్దం చేసిన ఎమ్మెల్యే.. మంగళవారం ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ముందుగా కూసుమంచి మండలం ముత్యాల గూడెం గ్రామంలో ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల టీవీ9తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు హీటెక్కాయని అన్నారు. పాలేరులో మా ప్రత్యర్థి కాంగ్రెస్ అని, పాలేరులో గట్టి పోటీ ఉంటుందని, రాజకీయాలు అంటేనే పోటీ అని అన్నారు. నేను ఎపుడూ ప్రజల్లోనే ఉన్నాను.. ఎన్నికలు సమయం వచ్చింది కనుక ఎక్కువ తిరుగుతున్నాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ల టికెట్స్ ఇస్తామన్నారని అన్నారు. టికెట్ గురించి ఆలోచనే లేదన్నారు. నాకు ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహాలు అవసరం లేదని పేర్కొన్నారు.