Pawan Kalyan: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. కత్తిపూడిలో జనసేన తొలి బహిరంగ.. Pawan Kalyan’s Varahi Yatra: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయ్. అన్నవరం టు భీమవరం ప్రయాణం మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రను మొదలుపెట్టబోతున్నారు.Pawan Kalyan’s Varahi Yatra: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయ్. అన్నవరం టు భీమవరం ప్రయాణం మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రను మొదలుపెట్టబోతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి మొదలై, భీమవరం వరకు సాగనుంది తొలి విడత యాత్ర. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ టూర్ సాగనుంది. యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 21న అమలాపురంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది జనసేన. మొత్తం 10 రోజులపాటు ఈ యాత్ర సాగనుంది.పూజల అనంతరం పవన్ కల్యాణ్ అన్నవరంలో జనసేన నేతలతో చర్చించనున్నారు. సా.4 గంటలకు అన్నవరం నుంచి యాత్రగా బయల్దేరి.. కత్తిపూడిలో జరిగే తొలి బహిరంగ సభలో పవన్ మాట్లాడనున్నారు. తొలి దశలో 10 రోజుల పాటు కొనసాగనున్న పవన్ వారాహి యాత్రలో.. 9 నియోజకవర్గాల్లో ఏడు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
అయితే, నిన్న మంగళగిరి జనసేన ఆఫీస్‌లో పవన్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, వాహనాన్ని సంసిద్ధం చేశారు. వారాహితోపాటు జనసేన అధినేత కూడా అన్నవరం చేరుకోని.. సత్యదేవుని సన్నిధానంలో పూజలు నిర్వహించి, యాత్రను ప్రారంభించనున్నారు.వారాహి యాత్ర మొదలు కాకముందే వైసీపీ నుంచి కౌంటర్లు పడ్డాయ్. ఎప్పుడైతే సీఎం పదవి వద్దన్నాడో అప్పుడే పవన్‌ను నమ్మడం కాపులు మానేశారన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. పవన్ టూర్‌తో అన్నవరం కొండపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయ్. జనసేన కార్యకర్తల హడావిడితో రాజకీయ పార్టీల జెండాలపై నిషేధం విధించారు. మరోవైపు, పవన్ బస చేయబోతున్న పల్లవి గెస్ట్‌హౌస్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.