Keerthy Suresh: మరోసారి అదే ప్రయోగం చేయనున్న కీర్తి.. ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కీర్తి. ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో స్టార్ డమ్ దక్కించుకున్న భామ కీర్తిసురేష్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కీర్తి. ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తోంది ఈ భామ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ భామ. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తోన్న కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ భామ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఓటీటీలలో సందడి చేసింది.కీర్తికి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంతగా కలిసి రాలేదు. ఈ అమ్మడు చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.దిల్ రాజు బ్యానర్ లో కీర్తిసురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనుందని తెలుస్తోంది. నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారని తెలుస్తోంది. ఆగస్టు లో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారట. రీసెంట్ గా నాని నటించిన దసరా సినిమాతో సాలీడ్ హిట్ అందుకుంది ఈ చిన్నది. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో చిరు చెల్లెలుగా కనిపించనుంది కీర్తి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.