కేవలం 6 బంతులే.. మ్యాచ్ మలుపు తిప్పి.. టీమిండియాను దెబ్బకొట్టిన ధోని శిష్యుడు.. ఎవరంటే?విజయానికి కావాల్సింది 280 పరుగులు.. చేతిలో ఉన్నది 7 వికెట్లు.. బరిలో కోహ్లీ, రహనే. టీమిండియా కచ్చితంగా ట్రోఫీ కొడుతుందని అందరూ భావించారు. కానీ ఒకే ఒక్క ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మలుపు తిప్పేసింది.
చివరి రోజు.. విజయానికి కావాల్సింది 280 పరుగులు.. చేతిలో ఉన్నది 7 వికెట్లు.. బరిలో కోహ్లీ, రహనే. టీమిండియా కచ్చితంగా ట్రోఫీ కొడుతుందని అందరూ భావించారు. కానీ ఒకే ఒక్క ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మలుపు తిప్పేసింది. ఇద్దరు భారత కీ బ్యాటర్లు ఔట్ అయ్యారు. ఇంతకీ ఆ ఓవర్ వేసింది కూడా మరెవరో కాదు.. ధోని శిష్యుడు. అతడి స్పెల్ భారత్‌కు ట్రోఫీ అందనివ్వకుండా చేసింది. అతడు మరెవరో కాదు స్కాట్ బొలాండ్.టెస్టుల్లోకి అరంగేట్రం చేసి రెండేళ్లు అవుతున్నప్పటికీ.. ఈ 34 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్‌కు తక్కువగానే అవకాశాలు దక్కాయి. అయితేనేం తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించి.. తన కెరీర్లోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్(6/7) నమోదు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఆస్ట్రేలియా పేస్ ఎటాక్‌లో కీలక పేసర్‌గా మారాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఐదో రోజులో స్కాట్ బొలాండ్ ఒక్క ఓవర్ మ్యాచ్ భారత్ చేతికి దక్కకుండా చేసింది. ఆ ఓవర్ రెండో బంతికి మంచి ఊపు మీదున్న విరాట్ కోహ్లీ(49)ని పెవిలియన్ చేర్చిన బొలాండ్.. ఐదో బంతికి జడేజా(0)ను డకౌట్ చేశాడు. ఇక అక్కడ నుంచి టీమిండియా కోలుకోలేకపోయింది. కొద్దిసేపు రహనే(46), భరత్(23) ప్రయత్నించినప్పటికీ.. చివరికి పరాజయం పాలైంది. అంతేకాదు.. అటు ఫస్ట్ ఇన్నింగ్స్, ఇటు సెకండ్ ఇన్నింగ్స్‌లలోనూ బొలాండ్.. శుభ్‌మాన్ గిల్ వికెట్లను పడగొట్టిన సంగతి తెలిసిందే.ధోని సారధ్యంలో ఐపీఎల్..
స్కాట్ బొలాండ్.. ఐపీఎల్లో ఆడాడు. ఇది చాలామందికి తెలియదు. ధోని, స్టీవ్ స్మిత్‌లతో అతడు 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కి ప్రాతినిధ్యం వహించాడు. అతడు ఆడిన 2 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. అయితేనేం క్రికెట్లో ఓనమాలు మాత్రం మిస్టర్ కూల్ ధోని దగ్గర నేర్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆడిన 8 అంతర్జాతీయ టెస్టుల్లో.. 33 వికెట్లు పడగొట్టి.. మరో నాలుగు రోజుల్లో జరగబోయే యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌లో కీలకంగా మారనున్నాడు.