Chanakya Niti: మీరు నవదంపతులా.. సంతోషకమైన జీవితం కోసం చాణుక్యుడు చెప్పిన ఈ విధానాలు పాటించండిసంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి ఆచార్య చాణక్యుడు కొన్ని సూచనలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. వీటిని అనుసరిస్తే భార్యాభర్తలు ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా, సంబంధం బలపడుతుంది. ఇద్దరి మధ్య మంచి అవగాహన పెంపొందుతుంది. దీనికి సంబంధించిన చాణక్యుడు చెప్పిన కొన్ని విధానాల గురించి తెలుసుకుందాం.పరస్పర గౌరవం: వ్యక్తిగా మీ జీవిత భాగస్వామి పట్ల గౌరవాన్ని పెంపొందించుకోండి. భార్యాభర్తలు తమ ఆలోచనలు, భావాలను గుర్తించడానికి ప్రయత్నించండి. గౌరవంగా చూసుకోండి. జీవిత భాగస్వామిలోని మంచి లక్షణాలను మెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.
పరస్పర గౌరవం: వ్యక్తిగా మీ జీవిత భాగస్వామి పట్ల గౌరవాన్ని పెంపొందించుకోండి. భార్యాభర్తలు తమ ఆలోచనలు, భావాలను గుర్తించడానికి ప్రయత్నించండి. గౌరవంగా చూసుకోండి. జీవిత భాగస్వామిలోని మంచి లక్షణాలను మెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.
మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి. తాదాత్మ్యం, అవగాహన: జీవిత భాగస్వామి భావాలను, అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా భార్యాభర్తల మధ్య అవగాహనను పెంపొందించుకోండి. సవాలు ఎదురైతే జీవిత భాగస్వామి మద్దతుగా నిలబడండి. ఇది బంధాన్ని బలపరుస్తుంది. అవగాహన కూడా పెరుగుతుంది.సహనం, క్షమాపణ: వివాహ బంధంలో సహనం, క్షమాపణ గుణం అతిముఖ్యం. ఈ గుణాలు ఎటువంటి భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా మెరుగుపరిచే గొప్ప గుణం. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తిచూపకుండా.. ఓపికపట్టండి .. తప్పు జరిగినప్పుడు క్షమించండి. మనోవేదనలను విడిచి పెట్టండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది.