Pawan Kalyan: సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలతో పవన్ కల్యాణ్ ధర్మ యాగం.. ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన కోసంPawan Kalyan Varahi Yatra: ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు. ఉదయం 6 గంటల 55 నిమిషాలకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలతో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు పవన్ కల్యాణ్. యాగశాలలో..మంగళగిరి, జూన్ 12: ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ .. మంగళగిరి జనసేన కార్యాలయంలో యాగం చేపట్టారు. ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు. ఉదయం 6 గంటల 55 నిమిషాలకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలతో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు పవన్ కల్యాణ్. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా ఉదయం ప్రారంభమైన యాగం రేపు కూడా కొనసాగుతుంది.విజయవాడ దుర్గగుడిలో వారాహి పొలిటికల్ యాత్ర సక్సెస్ కావాలంటూ జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లుండి నుంచి ప్రారంభంకానున్న పవన్ వారాహి యాత్ర ఎలాంటి ఆటంకాల్లేకుండా కొనసాగాలని 108 కొబ్బరికాయలు కొట్టారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా.. చెడు దృష్టి పడకుండా ఉండేందుకే కొబ్బరికాయలు కొట్టామన్నారు జనసేన నేత పోతిన మహేశ్.
సెక్షన్ 30 యాక్ట్ సాధారణ విధుల్లో భాగమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేకించి జనసేన సభల కోసం పెట్టింది కాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత.. పవన్ కల్యాణ్ సభ జరిగే ప్రాంతాన్ని..జనసేన నేతలతో కలిసి పరిశీలించారు అమలాపురం డిఎస్పీ.. వారాహియాత్ర రూట్‌మ్యాప్‌ను కూడా పరిశీలించారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా అమలాపురంలో పోలీసులు ఆంక్షలు పెట్టారన్న వివాదం సద్దు మణిగింది.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం నుంచి నెలాఖరు వరకు సెక్షన్ 30 యాక్ట్ అమలులోకి వచ్చింది. దీంతో వారాహి యాత్రను అడ్డుకునేందుకే పోలీసులు ఆంక్షలు పెట్టారని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందారు. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. వారాహి యాత్ర కోసం ఆంక్షలు పెట్టలేదని.. అవన్నీ సాధారణ విధుల్లో భాగమేనని అమలాపురం ఎస్పీ చెప్పారు.