ఇంట్లో కొన్ని చోట్ల బరువు ఉండకూడదు. ఈశాన్యంలో బరువు అసలే ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బీరువా ఉంచే చోటు ఉత్తర వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి. నైరుతిలో కూడా బరువు ఉండకుండా చూసుకోవాలని వాస్తునిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీరువా ఉంచుకునే చోటు వాస్తు ప్రకారం
Beeruva: ఇంట్లో బీరువా డబ్బు దాచుకునే ప్రదేశం. అందుకే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం బీరువా ఎటు వైపు ఉండాలి. తలుపు తెరిస్తే ఏ వైపు ఉండాలి అనే విషయాలు చాలా ముఖ్యమనవి. బీరువా పెట్టుకునే ప్రదేశం కూడా ప్రధానంగా చూసుకోవాలి. బీరువాను ఇంటిలో ఎటు వైపు ఉంచుకోవాలి? ఎలా ఉంచితే మంచి ఫలితాలు వస్తాయనే విషయాలపై మనకు పూర్వీకులు ఎన్నో విషయాలు తెలియజేశారు. బీరువా ఉంచుకునే దిశ మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.
ఈశాన్యంలో బరువు ఉండొద్దు
ఇంట్లో కొన్ని చోట్ల బరువు ఉండకూడదు. ఈశాన్యంలో బరువు అసలే ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బీరువా ఉంచే చోటు ఉత్తర వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి. నైరుతిలో కూడా బరువు ఉండకుండా చూసుకోవాలని వాస్తునిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీరువా ఉంచుకునే చోటు వాస్తు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకుంటే మంచిది.
ఉత్తర, వాయువ్య దిశ అనుకూలం
వాయువ్య దిశ చంద్రునిది. అందుకే ఆ దిశలో బీరువా ఉంచుకుంటే ధన ప్రవాహం పెరుగుతుంది. పశ్చిమం, ఉత్తరానికి మధ్య ఉండే మూలలో బీరువాను ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. దక్షిణం వైపు ఉంచుకుంటే బీరువా తెరిచినప్పుడు దాని ముఖం ఉత్తరం వైపు చూసేలా ఉంచుకుంటే మంచిదే అంటున్నారు.
సరైన దిశలో..
బీరువాను సరైన దిశలో ఉంచుకోకపోతే ధననష్టం కలుగుతుంది. ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. బీరువాను ఉత్తర దిక్కు మధ్య ఉంచితే అనుకూలమైన పరిస్థితులు చోటుచేసుకుంటాయి. సంపదకు అధిపతి బుధుడు అయినందున ఉత్తర దిక్కు మధ్య భాగంలో బీరువా ఉంచితే మంచిదే. బీరువా తెరిచినప్పుడు దక్షిణం వైపు చూస్తుండాలి.