అందులోఉండేలా నీరు.. కరెంట్.. లాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్దిదారులు ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టారు. గుడివాలో అలాంటి పరిస్థితి రాకుండా సీఎం జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Kodali Nani : గుడివాడ నా అడ్డా అంటూ తరచూ కొడాలి నాని చెబుతుంటారు. నాపై పోటీచేయండి అంటూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కు సవాల్ చేస్తుంటారు. చిన్నాపెద్దా వయసు తారతమ్యం చూడరు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తుంటారు. మొన్నటికి మొన్న దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పైనే ఎడాపెడా తిట్ల దండకానికి పూనుకున్నారు. చివరకు ఆయన శరీరాకృతిపై సైతం తూలనాడారు. అయితే ఆయన ధైర్యమంతా గుడివాడ. ఆపై సీఎం జగన్ తన వెంట ఉన్నారన్న ధీమా. అయితే నాని విషయంలో ఏమనుకుంటున్నారో తెలియదు కానీ.. జగన్ ఆయనకు తరచూ హ్యండిస్తున్నారు.
తొలి మంత్రివర్గంలో కొడాలి నానికి చోటిచ్చారు. నా మనిషి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కొడాలి నాని వెనుకా ముందూ చూడలేదు. సామాజిక సమీకరణలతో ఉన్న మంత్రి పదవిని జగన్ తొలగించారు. దీంతో పవర్ సెంటర్ ను నాని నుంచి దూరం చేశారు. సహజంగానే తన నోటి దురుసుతో నాని శత్రువులను పెంచుకున్నారు. దీంతో గుడివాడలో కాస్తా టైట్ అవుతోంది. దీని నుంచి అధిగమించేందుకు సీఎం జగన్ ను తెచ్చి గుడివాడలో హడావుడి చేయాలని చూశారు. కానీ జగన్ అందుకు ససేమిరా అన్నారు. ఈ పరిణామాన్ని కొడాలి నాని అవమానంగా ఫీలవుతున్నారు.
టీడీపీ హయాంలో గుడివాడ నియోజకవర్గాన్ని చంద్రబాబు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగా వేలాది టిడ్కో ఇళ్లను నిర్మించారు. వాటిని లబ్దిదారులకు కేటాయించారు. చివరికి రోడ్లు, కరెంట్ వంటి సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు హ్యాండోవర్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. నాలుగేళ్లయింది. ఆ రోడ్లు.. కరెంట్ పనులు చేయలేదు. కానీ ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ చేసేశారు. సీఎం జగన్ వచ్చి ప్రారభించడానికి ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్ధయ్యింది.
దాదాపు టీడీపీ హయాంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. కానీ లేఅవుట్ లో మౌలిక వసతులు మాత్రం కల్పించలేకపోయారు. నాలుగేళ్లలో సమయం వృథా చేశారు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అనుకొని ప్రారంభోత్సవానికి పూనుకున్నారు. కానీ ఇటీవల ఇటువంటి ప్రారంభోత్సవాలకు చుక్కెదురవుతోంది. అమరావతిలో చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. అందులోఉండేలా నీరు.. కరెంట్.. లాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్దిదారులు ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టారు. గుడివాలో అలాంటి పరిస్థితి రాకుండా సీఎం జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరువాత సీఎం పర్యటన రద్దు కావడంతో కొడాలి నాని అవమానభారంగా ఫీలవుతున్నారు.