దసరా సంబరాల్లో అపశృతి: పూజా మండపం వద్ద తొక్కిసలాట.. ముగ్గురు మృతి!
బీహార్లో ప్రతి దసరాలకు దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా ఆ రాష్ట్రంలోని రాజా దళ్ ప్రాంతంలో దుర్గా పూజ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే రాజా దళ్ దుర్గా పూజ పండల్ వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున గుమికూడారు. ఒక్కసారిగా భక్తులు ముందుకు రావడంతో మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అయిదేళ్ల బాలుడితో సహా ఇద్దరు మహిళలు ప్రాణాలు..పాట్నా, అక్టోబర్ 25: దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా పూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పది మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం (అక్టోబర్ 23) రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్లో ప్రతి దసరాలకు దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా ఆ రాష్ట్రంలోని రాజా దళ్ ప్రాంతంలో దుర్గా పూజ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే రాజా దళ్ దుర్గా పూజ పండల్ వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున గుమికూడారు. ఒక్కసారిగా భక్తులు ముందుకు రావడంతో మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అయిదేళ్ల బాలుడితో సహా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన క్షతగాత్రులను పండల్-హాపర్లను సదర్ ఆసుపత్రిలో చేర్పించారు.దీనిపై గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాజాదలళ్ పూజా పండల్ గేటు దగ్గర తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో భక్తులు ప్రసాదం కోసం బారులు తీరడంతో ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి పోయాడు. బాలుడిని కాపాడేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. దీంతో జనాల కాళ్ల కింద పడి బాలుడితో సహా ఇద్దరు మహిళలకు ఊపిరాడక నలిగిపోయారు. అప స్మారక స్థితిలో ఉన్న మహిళలను ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో వారు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో మరో 10కి పైగా గాయపడ్డారు. వారిని సదర్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ స్వర్ణ ప్రభాత్ తెలిపారు. అయితే పూజా పండల గేటు వద్ద భక్తుల రద్దీని నియంత్రించేందుకు మండపం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లనే తొక్కిసలాటకు దారితీసిందని పోలీసు అధికారులు తెలిపారు.