Bigg Boss 7 Telugu: కొత్త కెప్టెన్ కోసం టాస్క్.. ప్రియాంకకు షాకిచ్చిన యావర్.. శోభా వర్సెస్ అశ్విని..
ఇక ఇప్పుడు హౌస్ లో కొత్త కెప్టెన్ కోసం కంటెస్టెంట్లకు టాస్కులు ఇస్తున్నాడు బిగ్బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో కొత్త కెప్టెన్ ఎవరనేది కంటెస్టెంట్స్ ఎంచుకోవాలంటూ ఫిటింగ్ పెట్టాడు. కొత్త కెప్టెన్ ఎవరు అవుతారో తెలుసుకోవడానికి ఫ్లోట్ ఆర్ సింగ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవరి ఫోటో అయితే నీటిలో మునిగి పోకుండా ఉంటుందో వాళ్లు కెప్టెన్సీ కంటెండర్స్గా కొనసాగుతారని చెప్పాడు. ఒక్కొక్కరు ఎవరు కెప్టెన్ గా అనర్హులో చెబుతూ వారి ఫోటోను ఫూల్ లో పడేయాల్సి ఉంటుందని చెప్పాడు.బిగ్బాస్ హౌస్ లో ఈవారం నామినేషన్స్ రచ్చ ఏ రేంజ్ లో జరిగాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ వారం హౌస్ లో మొత్తం బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు హౌస్మేట్స్. దీంతో ఆ తర్వాత ఫన్నీ టాస్కులు ఇచ్చి కాసేపు వినోదం పండించేందుకు ట్రై చేశాడు బిగ్బాస్. కానీ ఆ టాస్క్ అనుకున్నంతగా ఎంటర్టైన్ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు హౌస్ లో కొత్త కెప్టెన్ కోసం కంటెస్టెంట్లకు టాస్కులు ఇస్తున్నాడు బిగ్బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో కొత్త కెప్టెన్ ఎవరనేది కంటెస్టెంట్స్ ఎంచుకోవాలంటూ ఫిటింగ్ పెట్టాడు. కొత్త కెప్టెన్ ఎవరు అవుతారో తెలుసుకోవడానికి ఫ్లోట్ ఆర్ సింగ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవరి ఫోటో అయితే నీటిలో మునిగి పోకుండా ఉంటుందో వాళ్లు కెప్టెన్సీ కంటెండర్స్గా కొనసాగుతారని చెప్పాడు. ఒక్కొక్కరు ఎవరు కెప్టెన్ గా అనర్హులో చెబుతూ వారి ఫోటోను ఫూల్ లో పడేయాల్సి ఉంటుందని చెప్పాడు.ఇక ముందుగా శోభా శెట్టి వచ్చి.. ఇక్కడున్న వారందరిలో కంపేర్ చేస్తే నువ్వు కెప్టెన్ అవ్వడానికి ఫిట్ కాదు.. నీలో ఆ కెప్టెన్సీ పవర్ నాకు కనిపించడం లేదంటూ అశ్విని ఫోటో పట్టుకుంది. దీంతో నీకు ఎప్పటికీ కనిపించందంటూ కౌంటరిచ్చింది అశ్విని. చివరకు ఆమె ఫోటోను ఫూల్ లో పడేసింది శోభా. ఇక ఆ తర్వాత ఈ టాస్కు నుంచి ప్రశాంత్ ను తప్పిస్తూ.. అందరికీ అవకాశం రావాలంటూ చెప్పుకొచ్చింది పూజా మూర్తి. దీంతో ప్రశాంత్ మాట్లాడుతూ.. అంటే నీకు ఒకసారి ఛాన్స్ వచ్చింది ఇక అవసరం లేదంటున్నావ్ అంటూ రివర్స్ అయ్యాడు. అయితే అతనితో వాదించలేక ఫోటోను స్విమ్మింగ్ ఫూల్ లో వేసింది పూజా. ఇక ఆ తర్వాత యావర్ వర్సెస్ ప్రియాంక మధ్య గొడవ జరిగింది.ఈ టాస్కులో ప్రియాంకకు షాకిచ్చాడు యావర్. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే నువ్వేప్పుడు అమర్ గురించి మధ్యలోకి వస్తావు అంటూ సూటిగానే కడిగిపారేశాడు యావర్. ఎప్పుడూ అంటూ ప్రియాంక అరవడంతో.. ఆరోజు వీఐపీ రూంలో అమర్ కు నాకు స్ప్రైయిట్ గురించి గొడవ జరుగుతుంటే నువ్వు మధ్యలోకి ఎందుకు వచ్చావ్ అంటూ ప్రశ్నించాడు యావర్. దీంతో లెటర్ వచ్చిందా అని అడగడానికే వచ్చా.. అమర్ వస్తే నేను మధ్యలోకి రావాలని రూల్ ఏం లేదు. నేను సోలో.. నేను సోలోగానే వచ్చాను.. సోలోగానే ఆడతాను… సోలోగానే వెళ్తాను అంటూ గట్టిగా అరిచేసింది. దీంతో ఆమె ఫోటోను యావర్ ఫూల్ లో వేయడంతో హార్ట్ అయ్యి లోపలికి వెళ్లిపోయింది. ఇక కెప్టెన్సీ రేసులో ప్రశాంత్, అశ్విని, ప్రియాంక తప్పుకున్నట్లు ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ కొత్త కెప్టెన్ గా అర్జున్ అయినట్లు తెలుస్తోంది.