ఒకే రోజు ఒకే చోట మూడు కొండచిలువలు కలకలం.. స్నేక్ క్యాచర్ చేతిని కొరికి..
Puttaparthi: మూడు చోట్లా స్నేక్ క్యాచర్ మూర్తి…పాములను పట్టుకున్నారు. అయితే దుర్గమ్మ ఆలయం వద్ద భారీ కొండ చిలువను బంధిస్తుండగా స్నేక్ క్యాచర్ మూర్తి పాము కాటుకు గురయ్యారు….చేతి మీద కొండ చిలువ కొరకడంతో….మూర్తి చేతి నుంచి రక్తం కారింది. హుటాహుటినా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిం
పుట్టపర్తిలో పాముల కలకలం. ఒకేరోజు ఒకే చోట మూడు పాములు ప్రత్యక్షం కావడంతో జనం బెంబేలేత్తిపోతున్నారు. పుట్టపర్తిలోని దుర్గమ్మ ఆలయం ప్రధాన రహదారిపై భారీ కొండ చిలువ కలకలం రేపింది. అదే విధంగా ప్రైవేట్ పాఠశాల సమీపంలోని ఓ ఇంటి కాంపౌండ్ లోకి మరో కొండచిలువ చొరబడింది. అక్కడి నుంచి కాస్త దూరంలోనే నాగేపల్లిలో ఇంటిలోకి పాము దూరడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. మూడు పాములను అతి కష్టం మీద పట్టుకొని బందించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు స్నేక్ క్యాచర్ మూర్తి.మూడు చోట్లా స్నేక్ క్యాచర్ మూర్తి…పాములను పట్టుకున్నారు. అయితే దుర్గమ్మ ఆలయం వద్ద భారీ కొండ చిలువను బంధిస్తుండగా స్నేక్ క్యాచర్ మూర్తి పాము కాటుకు గురయ్యారు….చేతి మీద కొండ చిలువ కొరకడంతో….మూర్తి చేతి నుంచి రక్తం కారింది. హుటాహుటినా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించుకోవడంతో స్నేక్ క్యాచర్ మూర్తి కోలుకున్నారు. ఒకే రోజు…ఒకే చోట మూడు పాములు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు…మొత్తం మీద పాములను పట్టుకుని అటవీ ప్రాంతంలోకి వదిలేయడంతో…. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.