ఎమోషన్స్ పండడం తో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.ఇక ధనరాజ్ మరియు రాహుల్ రామకృష్ణ కామెడీ కాస్త ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది, యాంకర్ అనసూయ కూడా వేశ్య పాత్రలో నటించలేదు,
Vimanam Movie Review: నటీనటులు : సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ద్రువన్, మీరా జాస్మిన్, ధన్ రాజ్, రాహుల్ రామకృష్ణ
దర్శకుడు : శివ ప్రసాద్ యానాల
సినిమాటోగ్రఫీ : వివేక్ కాలేవు
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్ : చరణ్ అర్జున్
గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ఉన్న నెటిజెన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించిన చిత్రం విమానం. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్ర ఖని ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఒకపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో ది అవతార్’ సినిమాకి దర్శకత్వం వహిస్తూనే , మరోపక్క ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. సినిమా ప్రొమోషన్స్ లో కూడా చాలా చురుగా పాల్గొన్నాడు. ఆయనతో పాటుగా యాంకర్ అనసూయ, ధన్ రాజ్ మరియు రాహుల్ రామకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్ మరియు ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది, ఆడియన్స్ ని ఈ చిత్రం ఏ మాత్రం అలరించిందో ఒక్కసారి ఈ రివ్యూ లో చూద్దాము.
కథ :
పేదరికం మరియు అంగవైకల్యం తో బాధపడుతూ జీవితం తో పోరాడే వీరయ్య (సముద్ర ఖని) సులభ్ కంప్లెక్స్ ని నడుపుకుంటూ దాని ద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తుంటాడు. ఆయన భార్య పెళ్ళైన కొత్తలోనే రాజు (మాస్టర్ ధృవన్) అనే బిడ్డకి జన్మని ఇచ్చి చనిపోతుంది. చిన్నప్పటి నుండే తల్లి ప్రేమకు దూరమైనా రాజుని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు వీరయ్య. ఇక వీరయ్య కి తోడుగా అదే కాలనిలో చెప్పులు కొట్టుకునే వ్యక్తి (రాహుల్ రామకృష్ణ) మరియు ఆటో డ్రైవర్ (ధన్ రాజ్) ఉంటారు. అయితే రాజు కి చిన్నతనం నుండి విమానాలు అంటే ఇష్టం, అందులో ఒక్కసారైనా ప్రయాణించాలి అని అనుకుంటూ ఉంటాడు. విమానం ఎక్కించు నాన్న అని తన తండ్రి వీరయ్య ని అడుగుతూ ఉంటాడు. పేదరికం తో ఎన్నో కష్టాలను అనుభవించే వీరయ్య తన కొడుకు కోరికని తీర్చాడా?, అలాగే కాలనీ లో ఉండే సుమతి (అనసూయ భరద్వాజ్ ) అనే వేశ్యని చెప్పులు కొట్టుకునే వాడు (రాహుల్ రామకృష్ణ) ఎందుకు ప్రేమించాడు. అతని ప్రేమని సుమతి అంగీకరించిందా లేదా?, ఇలాంటివన్నీ వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించాడు డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల. ఇక ఈ చిత్రం లో సముద్ర ఖని నటన గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఆయన నటన చాలా సన్నివేశాల్లో ఎమోషనల్ గా ఉంటుంది, ప్రేక్షకుల కళ్ళలో నుండి నీళ్లు రప్పించేలా చేస్తుంది. సముద్ర ఖని అంటే విలక్షణ నటుడు, ఆయనకీ ఎంతో అపారమైన అనుభవం ఉంది, ఆయన మళ్ళీ గొప్పగా నటించడం లో ఆశ్చర్యం లేదని అనుకోవచ్చు.కానీ చిన్న కుర్రాడు మాస్టర్ ధృవన్ మాత్రం, ఎంతో అనుభవం ఉన్న సముద్ర ఖని తో పోటీ పది మరి నటించాడు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కాస్త సినిమాటిక్ లిబర్టీ కి బాగా దగ్గరగా ఉన్నట్టుగా తీసినట్టు అనిపించింది.
కానీ ఎమోషన్స్ పండడం తో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.ఇక ధనరాజ్ మరియు రాహుల్ రామకృష్ణ కామెడీ కాస్త ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది, యాంకర్ అనసూయ కూడా వేశ్య పాత్రలో నటించలేదు, జీవించింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చివరి 20 నిమిషాలు సినిమాకి హైలైట్ అని అనొచ్చు. ఈ 20 నిమిషాలకు కనెక్ట్ అవ్వని ప్రేక్షకుడు అంటూ ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక చరణ్ అర్జున్ అందించిన సంగీతం పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సన్నివేశాలకు ఊపిరి పోసింది. హను రావిపూడి అందించిన డైలాగ్స్ కూడా ఆడియన్స్ హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుంది.
చివరి మాట :
ప్రతీ ఒక్కరికి కన్సెట్ అయ్యే చిత్రం, ఈ వీకెండ్ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. ప్రధాన పాత్రల నటన మనకి కంటతడి పెట్టిస్తుంది.
రేటింగ్ : 2.75/5