Bigg Boss 7 Telugu: అపార్ధం చేసుకోవద్దు.. అమర్ దీప్ గురించి అతని భార్య ఏం చెప్పిందంటే..
తన స్ట్రాటజీతో గేమ్ ఆడాలన్నా హౌస్ లో ఉన్నవారు తనను ఆడనివ్వడం లేదు అని అమర్ దీప్ చాలా సందర్భాల్లో బాధపడ్డాడు. ఇక అమర్ దీప్ పై ఇప్పటికే నెగిటివిటి ఎక్కువైంది. అతను గేమ్ సరిగ్గా ఆడటం లేదని చూస్తున్న ప్రేక్షకులు భావిస్తున్నారు. నాగార్జున కూడా ఇప్పటికే అమర్ దీప్ కు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు. గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటానని అమర్ కూడా ప్రతివారం చెప్పుకుంటూ వస్తున్నాడు.బిగ్ బాస్ సీజన్ 7 లో సీరియల్ బ్యాచ్ లో సందడి ఎక్కువైంది. హౌస్ లోకి వచ్చిన సీరియల్ బ్యాచ్ లో అమర్ దీప్ ఒకరు. అమర్ దీప్ గౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి గేమ్ ఆడలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. తన స్ట్రాటజీతో గేమ్ ఆడాలన్నా హౌస్ లో ఉన్నవారు తనను ఆడనివ్వడం లేదు అని అమర్ దీప్ చాలా సందర్భాల్లో బాధపడ్డాడు. ఇక అమర్ దీప్ పై ఇప్పటికే నెగిటివిటి ఎక్కువైంది. అతను గేమ్ సరిగ్గా ఆడటం లేదని చూస్తున్న ప్రేక్షకులు భావిస్తున్నారు. నాగార్జున కూడా ఇప్పటికే అమర్ దీప్ కు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు. గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటానని అమర్ కూడా ప్రతివారం చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదట్లో శివాజీ ప్రశాంత్ కు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడని పవర్ అస్త్ర దక్కించుకున్న శివాజి తనకు అన్యాయం చేశాడని హౌస్ లో గొడవ పడటమే కాదు నాగ్ ముందు కూడా అదే చెప్పాడు.
ఇక అమర్ దీప్ ప్రతివారం నామినేట్ అవుతున్నాడు. ఏదోరకంగా ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతున్నాడు అమర్ దీప్. ఇక ఇప్పుడు ఇప్పుడే అమర్ దీప్ గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. బిగ్ బాస్ మాజీ బ్యూటీ అరియానా కూడా అమర్ దీప్ ను సపోర్ట్ చేసింది. మనోడికి టైం కలిసి రావడం లేదు అని.. టైం కలిసొస్తే అమర్ సత్తా చాటుతాడు అని చెప్పుకొచ్చింది అరియానా. తాజాగా అమర్ దీప్ భార్య తేజస్విని అమర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.తేజస్విని మాట్లాడుతూ.. అమర్ దీప్ ది చిన్నపిల్లాడి మనస్తత్వం.. చిన్న పిల్లలు ఎలా చేస్తారో అం,అమర్ కూడా అలాగే చేస్తాడు. ఒక్కొక్కసారి మాట వింటాడు.. ఒకొక్కసారి మాట వినడు. చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం వస్తే.. అమర్‌ని హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పుకొచ్చింది. అమర్ ను అర్ధం చేసుకోవాలి.. అపార్ధం చేసుకోకూడదు అంటుంది తేజస్విని. బిగ్ బాస్ హౌస్ లో మైండ్ గేమ్ ఆడవాళ్లు ఎక్కువగా ఉంటారు. మన ముందు బాగానే ఉంటారు. కానీ మన వెనక గేమ్ ఆడుతారు. అమర్ అది అర్ధం చేసుకోలేకపోతున్నాడు అంటుంది తేజస్విని. అమర్ దీప్.. ఏది చెప్పినా నమ్మేస్తాడు. ఎదుటివారు తనను అర్ధం చేసుకుంటారా లేదా అని భయపడతాడు. టాస్క్‌లలో కష్టపడతాడు.. విన్ అవ్వాలని ఆడతాడు.కానీ మైండ్ గేమ్ రాదు. డిఫరెంట్ మైండ్ సెట్స్‌ని హ్యాండిల్ చేయడం కష్టమే. మనుషుల్ని హ్యాండిల్ చేయడం తనకు రాదు అంటూ చెప్పుకొచ్చింది తేజస్విని. ఇక ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉన్నాడు అమర్.