Telangana: మాటలకు అందని విషాదం.. ఆస్పత్రికి వెళ్లి తిరిగివస్తూ కొడుకు, తల్లి జల సమాధిహనుమకొండ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. కొడుకును కుక్క కరిచిందని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లి ఇంటికి తిరిగివస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే రోడ్డు పక్కన పొంచి ఉన్న కుంట ఆ కుటుంబాన్ని మింగేసింది. తండ్రికి ఈత రావడంతో మృత్యుంజయుడయ్యాడు. కానీ తల్లి ఆరు నెలల గర్భిణీతో సహా మూడేళ్ల బాలుడు జల సమాధి అయిపోయారు. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామం వద్ద జరిగింది .హనుమకొండ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. కొడుకును కుక్క కరిచిందని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లి ఇంటికి తిరిగివస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే రోడ్డు పక్కన పొంచి ఉన్న కుంట ఆ కుటుంబాన్ని మింగేసింది. తండ్రికి ఈత రావడంతో మృత్యుంజయుడయ్యాడు. కానీ తల్లి ఆరు నెలల గర్భిణీతో సహా మూడేళ్ల బాలుడు జల సమాధి అయిపోయారు. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామం వద్ద జరిగింది . అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. నర్సక్కపల్లి గ్రామంలోని తూర్పాటి రమేష్ అతని భార్య రాజేశ్వరి, కొడుకుతో కలిసి ఉంటున్నారు. అతని భార్య ఆరు నెలల గర్భవతి. తాజాగా రమేష్ కొడుకుకి కుక్క కరిచింది. దీంతో అతన తన భార్య, కొడకుతో కలిసి చికిత్స కోసం వరంగల్‌కు వెళ్లారు.ఆ బాలుడికి చికిత్స అందించారు. చికిత్స జరిగిన తర్వాత ద్విచక్రవాహనంపై ఆ కుటుంబం తిరిగివస్తోంది. ఇంతలోనే వారిని మృత్యువు వెంటాడింది. గ్రామ శివారులోని ఓ మూలమలుపు వద్ద బైక్ తో సహా కుటుంబమంతా ఓ కుంటలో పడి పోయారు. అయితే రమేష్ కు ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. కానీ తన కొడుకు చోటు, భార్య రాజేశ్వరి మాత్రం ఆ కుంటలోనే మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముందుగా బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం దాదాపు 8 గంటల పాటు గాలించి గర్భిణీ రాజేశ్వరి మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. కళ్ళముందే భార్య – కన్నా కొడుకు జల సమాధి అవ్వడంతో రమేష్ బోరున విలపించాడు. కొడుకు మృత దేహాన్ని చూస్తూ కన్నీటీ పర్యంతమయ్యాడు. రమేష్ కుటుంబంలో భార్య, కొడుకు మృతిచెందడంతో వారి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రమేష్ ఆవేదనను చూసి గ్రామస్థులు సైతం కంటతడిపెడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి.. ఇలా ఒక్కసారిగా కుటుంబంలో భార్య, కొడుకు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.