Bigg Boss 7 Telugu Guppendantha Manasu Fame Jagathi Alias Jyothiroy Will Entry Wildcard In Bigg Boss House
Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌లోకి ఆ సీరియల్ బ్యూటీ.. అందుకే అర్థాంతరంగా ఆమె క్యారెక్టర్ క్లోజ్ చేశారా ?..
ఇప్పుడు వీకెండ్ వచ్చేసింది ఐదోవారం హౌస్ నుంచి మరోకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రియాంక ఈవారం ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం మరిన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ఆదివారం మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారట. అర్జున్ అంబటి, అంజలి పవన్, పూజా మూర్తి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రోజుకో పేరు తెరపైకి వస్తుంది.బిగ్‌బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎన్నికయ్యాడు. నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన రంగుపడుద్ది రాజా పోటీలో తనకంటే రెట్టింపు బలం ఉన్న కంటెస్టెంట్లను అల్లాడించేశాడు. ఓవైపు ఫిజికల్, మరోవైపు మెంటల్‌గా మాటలతో టార్చర్ చేసిన గెలవాలన్న కసితో ఆడి విజేత అయ్యాడు. అయితే ఇప్పుడు వీకెండ్ వచ్చేసింది ఐదోవారం హౌస్ నుంచి మరోకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రియాంక ఈవారం ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం మరిన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ఆదివారం మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారట. అర్జున్ అంబటి, అంజలి పవన్, పూజా మూర్తి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రోజుకో పేరు తెరపైకి వస్తుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో సీరియల్ నటి పేరు వినిపిస్తోంది. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ లోకి ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఆమె మరెవరో కాదు. గుప్పెడంత మనసు ఫేమ్ జగతి అలియాస్ జ్యోతిరాయ్. బుల్లితెర ప్రేక్షకులకు జగతి గురించి పరిచయం అవసరం లేదు. కొడుకు ప్రేమ కోసం తల్లడిల్లే తల్లి పాత్రలో ఆమె నటన అద్భుతం. అతి తక్కువ సమయంలోనే తన నటనతో తెలుగు వారి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సంప్రదాయ కట్టుబొట్టుతో మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది.అయితే ఇప్పుడు నెంబర్ వన్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్ర ముగిసింది. కొడుకు ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను అడ్డుపెట్టింది. అదే సమయంలో శత్రువుల చేతిలో మరణించింది. అయితే ఈ సీరియల్లో జగతి పాత్ర మరణం ప్రేక్షకులకు సడెన్ షాకిచ్చింది. బుల్లెట్ గాయంతో కొన్నాళ్లు ఆసుపత్రిలో ఉంటుందని.. ఈ క్రమంలోనే తన తల్లికి రిషి దగ్గరవుతాడని అనుకున్నారంతా. కానీ అందుకు భిన్నంగా జగతి మరణించి ఆ పాత్రను అంతటితో క్లోజ్ చేశారు. అయితే ఇప్పుడు అదే విషయంపై ఆసక్తికర అప్డేట్ నెట్టింట చర్చ జరుగుతుంది. ప్రస్తుతం వినిపిస్తోన్న టాక్ ప్రకారం బిగ్‌బాస్ సీజన్ 7లోకి జగతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందని.. అందుకే సీరియల్ నుంచి తప్పుకుందని అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారికంగా అప్డేట్ రాలేదు.మరోవైపు ఇప్పుడిప్పుడే ఓటీటీలోకి అడుగుపెడుతుంది జ్యోతిరాయ్. ఇటీవలే ది ప్రెటీ గర్ల్ అనే వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగై జ్యోతిరాయ్ కు ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. కొద్దిరోజులుగా జ్యోతిరాయ్ వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. పెళ్లై బాబు ఉన్న జ్యోతిరాయ్ ఓ యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇక ఆ వార్తలనే నిజం చేస్తూ ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో దర్శకుడు సుకు పుర్వాజ్ తో ఎంగెజ్మెంట్ జరిగిందంటూ ఉంగరం గుర్తుతోపాటు లవ్ బర్డ్స్ ఏమోజీలను షేర్ చేసింది జ్యోతిరాయ్. అయితే ఇప్పుడు మరోసారి జ్యోతిరాయ్ పేరు తెరపైకి వచ్చింది.