Andhra Pradesh: మహానంది ఆలయంలోని కోనేరు ప్రత్యేకత.. రహస్యాన్ని తెలుసుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు..
Kurnool: దేవస్దానం వెనుక వైపు ఉన్న నల్లమల కొండల నుంచి వచ్చే నీరు ఆలయ గర్బగుడిలోని శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కిందనుండి నుంచి నీరుగా ప్రవహిస్తూ రుద్రగుండం కొనేరులోకి, అక్కడి నుంచి బ్రహ్మ, విష్ణు గుండం కొనేరులోకి ఆ తర్వాత మహానంది చుట్డుప్రక్కల గల వందల ఎకరాల పంటపొలాలకు నీరు ప్రవహిస్తుంది. అంతే కాకుండా మహానంది క్షేత్రంలో ఎక్కడైన పది అడుగుల లోతులోనే నీటి ఊటలు పడటం విశేషం.కర్నూలు, అక్టోబర్06; శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన మహానంది ఆలయ కోనేరు పై ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి ఏ సీజన్ అయినా సరే ఒకే లెవెల్లో కొన్ని వందల దశాబ్దాల నుంచి నీటి ప్రవాహంలో ఏమాత్రం తేడా లేదు నీరు కూడా స్వచ్ఛంగా ఉండటం, కొన్ని వందల ఎకరాలకు నీరు లభిస్తుండటం, నీటి దారులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అందుకే మహానంది కోనేరులో స్నానం ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారుశ్రీ మహానంది క్షేత్రంలో ఎండాకాలం అయిన వాన కాలం అయిన ఏ కాలం అయిన నీటి ప్రవాహం ఒకే విధంగా ఉబ్ వుండటం ఇక్కడ విశేషం.అందుకే ఈ ఆలయానికి తీర్థ క్షేత్రం అని పేరు కలదు. ఈ క్షేత్రంలోని నీరు ఐదుదారలుగా నితగయ ప్రవహిస్తూ ఉంటుందని స్కందపురాణంలో చెప్పినట్లు ప్రదాన అర్చకులు చెబుతున్నారు.క్షేత్రంలోని కోనేరులో స్నానం చేస్తే అహొల్లదంతో పాటు అనారోగ్యాలు కూడా తొలిగి పోతాయని ప్రచారం కూడా స్దానికంగా పెద్ద ప్రచారం జరుగుతుంది.
దేవస్దానం వెనుక వైపు ఉన్న నల్లమల కొండల నుంచి వచ్చే నీరు ఆలయ గర్బగుడిలోని శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కిందనుండి నుంచి నీరుగా ప్రవహిస్తూ రుద్రగుండం కొనేరులోకి, అక్కడి నుంచి బ్రహ్మ, విష్ణు గుండం కొనేరులోకి ఆ తర్వాత మహానంది చుట్డుప్రక్కల గల వందల ఎకరాల పంటపొలాలకు నీరు ప్రవహిస్తుంది. అంతే కాకుండా మహానంది క్షేత్రంలో ఎక్కడైన పది అడుగుల లోతులోనే నీటి ఊటలు పడటం విశేషం.ఈ నీరు ఎక్కడి నుంచి వస్తూంది ,ఎలా వస్తూంది అనే విషయం ఇప్పటికీ రహస్యంగా ఇక్కడి ప్రాంత ప్రజలు చెప్పుకుంటుంటారు.ఎక్కడి నుంచి ఈ ప్రవాహం మొదలౌతుంది అని తెలుసుకోడాని అనేక మంది అనేక ప్రయత్నాలు చేశారు కాని ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకి లభించలేదు.ఇరవై రెండు సంవత్సరాల క్రితం ప్రముఖ ఛానల్ అయిన నేషనల్ జియోగ్రాఫి ఛానల్ వారు నీటి రహస్యం ఛేధించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని తెలుస్తుంది.
కోనేరులలో ఉండే నీరు ఎంతో స్వచ్చంగా ఉండటంతో పాటు నీటిలో ఔషదగుణాలు కూడా ఉన్నాయనేది చరిత్రకారులు చెబుతున్న మాట.నీటిలో నుంచి చూస్తే క్రింద ఉన్న ఇసుక రాళ్ళు స్పష్టంగా కనిపిస్తూండటం ఇక్కడ గమనించ వచ్చు.ఈ నీళ్ళలో భక్తుల అభరణాలు మిస్ అయిన సందర్భాలలో ఆలయ సిబ్బంది కొద్ది నిమిషాల్లో నీటిలో గుర్తించి బాదితులకు ఇచ్చే వారు.
నల్లమల అటవి ప్రకృతి అందాల మద్య ఎంతో అహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం సందర్శించడానికి అనేక మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు.మహానంది క్షేత్రంకు ఎపి తెలంగాణ తో పాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు అనేక మంది నిత్యం వస్తూ ఉంటారు.క్షేత్రంకు రావటానికి నంద్యాల,కర్నూలు నుంచి బస్సు సౌకర్యం ఉండటంతో క్షేత్రంకు భక్తుల రద్దీ పెరుగుతుంది.