Amit Shah: 15న ఖమ్మం రానున్న అమిత్ షా.. లక్ష మంది వచ్చేలా బహిరంగ సభ ఏర్పాట్లుకేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 15న ఖమ్మం రానున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, జిల్లా నేతలతో కలిసి శుక్రవారం ఆయన ఖమ్మంలోని ఎస్పీ స్టేడియం, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాలను పరిశీలించారు.కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 15న ఖమ్మం రానున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, జిల్లా నేతలతో కలిసి శుక్రవారం ఆయన ఖమ్మంలోని ఎస్పీ స్టేడియం, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాలను పరిశీలించారు. అమిత్‌షా తొలిసారిగా ఖమ్మంలో పర్యటిస్తుండటంతో ప్రజలు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉందని.. అందుకే సువిశాల ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానాన్ని ఎంపిక చేశామని పేర్కొన్నారు. ప్రజలు సభకు స్వచ్ఛందంగా రావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్టేడియంలోని పిల్లలతో కాసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడారు.ఇదిలా ఉండగా అంతకుముందు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నేతలతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. కమ్యూనిస్టులను కేసీఆర్ విమర్శించినప్పటికీ వారు మాత్రం బీఆర్ఎస్ చెంతకే చేరుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు.