Nithya Menen: నేను ఆ ఇంటర్వ్యూ ఇవ్వలేదు.. ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన నిత్యామీనన్సోషల్ మీడియాలో ఎక్కువగా తప్పుడు వార్తలు వైరల్ అవుతుంటాయి. హీరోయిన్స్ గురించి ఇప్పటికే చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది. ఈ హీరో విడాకులు తీసుకుంటున్నాడు అంటూ ఎదో ఒక తప్పుడు వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. కొంతమంది పనిగట్టుకొని మరి ఇలా నెగిటివ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వార్తల విషయంలో కొందరు పట్టించుకోకుండా.. మౌనంగానే ఉంటారు . మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా టాలెంటడ్ నటి నిత్యా మీనన్ పై కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయింది. సోషల్ మీడియా వాడకం వల్ల ఎంత పాజిటివ్ ఉంటుందో.. అంటే నెగిటివ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీలు ఎక్కువగా సోషల్ మీడియా వల్ల ఇబ్బందిపడ్డారు. సోషల్ మీడియాలో ఎక్కువగా తప్పుడు వార్తలు వైరల్ అవుతుంటాయి. హీరోయిన్స్ గురించి ఇప్పటికే చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది. ఈ హీరో విడాకులు తీసుకుంటున్నాడు అంటూ ఎదో ఒక తప్పుడు వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. కొంతమంది పనిగట్టుకొని మరి ఇలా నెగిటివ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వార్తల విషయంలో కొందరు పట్టించుకోకుండా.. మౌనంగానే ఉంటారు . మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా టాలెంటడ్ నటి నిత్యా మీనన్ పై కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నటి నిత్యా మీనన్ కూడా తన పై వస్తున్న వార్తల పై స్పందించింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరారు.నిత్యామీనన్ తమిళ్ హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. అయితే తమిళ ఇండస్ట్రీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా .. ఓ తమిళ హీరో నన్ను వేధించాడని నిత్యా మీనన్ అన్నట్లు కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ వార్తలు సోషల్ మీడియాలోనూ చాలా వైరల్ అయ్యాయి. అయితే ఇది అవాస్తవమని నిత్యా మీనన్ స్పష్టం చేసింది.‘ఇది ఫేక్ న్యూస్. ఇందులో వాస్తవం లేదు. నేను ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ అబద్ధాన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కేవలం క్లిక్ల కోసమే ఇలాంటి ఫేక్ న్యూస్ సృష్టించే వ్యక్తులపై వేటు వేయాలి’ అని నిత్యా మీనన్ తెలిపింది. ‘అంత దిగజారకండి. మంచిగా ఉండండి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అని తెలిపింది నిత్యా.
నిత్యామీనన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ధనుష్ 50వ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్ జె సూర్య, సందీప్ కిషన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.