‘ఆదిపురుష్’ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరగడానికి కావాల్సినంత బూస్ట్ ని ఇచ్చింది ఈ ట్రైలర్. ఇందులో ఎక్కువగా ప్రభాస్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలని ఎక్కువగా చూపించారు. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇక పోతే ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి గోలనే_ _ _
Prabhas Marriage: ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి లో వేలాది మంది అభిమానుల సమక్షం లో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిన్నజియ్యర్ స్వామిజీ వచ్చారు.ఇక కాసేపటి క్రితమే విడుదల చేసిన యాక్షన్ ట్రైలర్ కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
‘ఆదిపురుష్’ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరగడానికి కావాల్సినంత బూస్ట్ ని ఇచ్చింది ఈ ట్రైలర్. ఇందులో ఎక్కువగా ప్రభాస్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలని ఎక్కువగా చూపించారు. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇక పోతే ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి గోలనే ఎక్కువగా వినిపిస్తాది.
యాంకర్స్ దగ్గర నుండి అభిమానుల వరకు ప్రతీ ఒక్కరూ ఎప్పుడు మీ పెళ్లి అని అడుగుతూ ఉంటారు. ఇక ఈరోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ గట్టిగా రావడం ప్రారంభిస్తారు. అది విన్న ప్రభాస్ పెళ్లా?, కచ్చితంగా చేసుకుంటా, ఇదిగో ఇక్కడే తిరుపతి లోనే చేసుకుంటా ఎప్పుడు చేసుకున్నా అని సమాధానం ఇస్తాడు.
ఇంతకీ ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది ప్రస్తుతానికి అయితే చెప్పలేదు కానీ, ఈ మాత్రం చాలదా మన మీడియా కి ఇండియా లో ఉన్న హీరోయిన్స్ అందరితో ప్రభాస్ కి లింక్ పెట్టేయడానికి. ప్రస్తుతానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆయన ఈ మాట అనడం తో కచ్చితంగా సోషల్ మీడియా లో రేపటి నుండి ప్రభాస్ – కృతి సనన్ హాట్ టాపిక్ గా మారిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.