Watch: ఇది మంచం కాదు.. లీటర్ పెట్రోల్ పోస్తే చాలు.. రోడ్డుమీద రయ్ రయ్.. మంటూ పరిగెడుతుంది..!జీవితాన్ని సులభతరం చేసుకునే ప్రక్రియలోప్రజలు జుగాద్ ద్వారా ఇలాంటి ఎన్నో అద్భుతాలు, ఆవిష్కరణలు కనిపెడుతుంటారు. మట్టి కుండతో ఎయిర్ కూలర్, టేబుల్ ఫ్యాన్‌తో ఏసీ లాంటి చల్లదనం, సైకిల్‌ను బైక్‌గా మార్చేసిన అనేక వీడియోలు ఇప్పటికే మనం సోషల్ మీడియాలో అనేకం చూశాం. వాటిని చూశాక.. ఇది కూడా సాధ్యమేనా అనే సందేహం కలుగకమానదు.మంచాన్ని వాహనంగా మార్చగల సమర్థులు, ఘనులు మన మన భారతీయులు మాత్రమే చేయగలరు.. ! అవును, సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని నవ్వించడమే కాకుండా మిమ్మల్ని ఆలోచింప జేస్తుంది. వీడియో చూస్తే మీరు.. ఇలాంటి వారికి ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే అంటారు. అయితే ఇలాంటి జుగాడ్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కానీ, వారి దైనందిన జీవితాన్ని సులభతరం చేసుకునే ప్రక్రియలోప్రజలు జుగాద్ ద్వారా ఇలాంటి ఎన్నో అద్భుతాలు, ఆవిష్కరణలు కనిపెడుతుంటారు. మట్టి కుండతో ఎయిర్ కూలర్, టేబుల్ ఫ్యాన్‌తో ఏసీ లాంటి చల్లదనం, సైకిల్‌ను బైక్‌గా మార్చేసిన అనేక వీడియోలు ఇప్పటికే మనం సోషల్ మీడియాలో అనేకం చూశాం. వాటిని చూశాక.. ఇది కూడా సాధ్యమేనా అనే సందేహం కలుగకమానదు. ఈ కుర్రాళ్ల జుగాద్ కూడా అలాంటిదే. ఇక్కడ ఓ యువకుడు ఇంట్లో నిరుపయోగంగా పడివున్న చక్రాలు, మోటారు బిగించి మంచాన్ని కదిలే వాహనంగా తయారు చేశాడు. అదేలా ఉందో వైరల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి, వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారు అనేది మాత్రం తెలియరాలేదు.ఈ వీడియోను జూన్ 9న ట్విట్టర్ హ్యాండిల్ @ముంబైకహార్9 – ఇన్నోవేటివ్ జుగాడ్ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఇక్కడ కొందరు యువకులు ఇంట్లో ఉండే మంచాన్ని మూడు చక్రాల వాహనంగా మార్చారు. ఆ కదిలే మంచం వెహికిల్ పై కూర్చుని ఆ ఇద్దరు యువకులు పెట్రోల్ పంప్‌కు రావటం వీడియోలో కనిపించింది. అందులో ఒకరు మంచ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపించింది. అయితే, ఆ వాహనంలో వారు పెట్రోల్ కొట్టించేందుకు వచ్చారు. దీంతో పెట్రోల్ పంపు వద్ద నిలబడి ఉన్న వాహనదారులు, స్థానిక ప్రజలు విచిత్ర వాహనాన్ని వింతగా చూస్తుండి పోయారు. ఇదేం బండిరా సామీ అనుకుంటూ అందరూ తమ సెల్‌ఫోన్ కెమెరాలో ఫోటోలు, వీడియోలు తీయటం మొదలుపెట్టారు. దాదాపు 3 నిమిషాల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట దూసుకుపోతుంది.