Poonam Kaur: చంద్రబాబు అరెస్ట్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ రియాక్షన్ .. ఈ వయసులో ఇలా చేయడం తగదంటూ..టీడీపీ అధినేత అరెస్టు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మమతా బెనర్జీ, కుమారస్వామి లాంటి నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఇక పలువురు టాలీవుడ్ ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. ఇప్పటికే రాఘవేంద్రరావు, అశ్వినీదత్, నారా రోహిత్, నట్టి కుమార్ తదితరులు చంద్రబాబుకు మద్దతు తెలిపారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ టీడీపీ అధినేత అరెస్టుపై స్పందించింది.స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత అరెస్టు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మమతా బెనర్జీ, కుమారస్వామి లాంటి నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఇక పలువురు టాలీవుడ్ ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. ఇప్పటికే రాఘవేంద్రరావు, అశ్వినీదత్, నారా రోహిత్, నట్టి కుమార్ తదితరులు చంద్రబాబుకు మద్దతు తెలిపారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ టీడీపీ అధినేత అరెస్టుపై స్పందించింది. ’73 ఏళ్లు అంటే జైల్లో ఉండాల్సిన వయసు కాదు. ముఖ్యంగా, ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన తర్వాత ఇలా జైల్లో ఉండడం బాధాకరం. ఇప్పుడు జరుగుతున్న విషయాలపై మాట్లాడడానికి నాకెలాంటి అధికారం కానీ, సంబంధం కానీ లేదు. అయితే మానవత్వంతో మాత్రమే స్పందిస్తున్నాను. చంద్రబాబునాయుడు సార్ ఆరోగ్యం, వయసును పరిగణనలోకి తీసుకోవాలని మానవతా దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ట్వీట్ చేసింది పూనమ్ కౌర్.ఇదిలా ఉంటే 2006లో ‘ఒక విచిత్రం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూనమ్ కౌర్. ఆ తర్వాత శౌర్యం, వినాయకుడు, ఈనాడు, గణేశ్, నాగవల్లి, పయనం, గగనం, అటాక్, నాయకి, శ్రీనివాస కల్యాణం తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె చేనేత కార్మికుల సమస్యలపై పోరాడుతోంది. అలాగే చేనేత వస్త్రాల అంబాసిడర్‌గా వాటిని ప్రమోట్ చేసే పనుల్లో బిజిబిజీగా ఉంటోంది. కొన్నినెలల క్రితం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొందామె. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్.