Andhra Pradesh: కార్టూన్స్కు అలవాటు పడిన బాలుడు అనుమాస్పద మృతి.. సరదాగా ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారి..సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక.. స్కూల్ బ్యాగ్ ఇంట్లో పెట్టి.. ఓ చున్ని తీసుకొని వరండాలో ఆడుకుంటున్నాడు. తల్లి లోపల గదిలో టీవీ చూస్తూ ఉంది. తండ్రి శ్రీనివాసరావు ఇంట్లో లేడు. అటుగా వెళుతున్న ఓ మహిళ పెద్ద కేకలు వేసింది. దీంతో లోపల నుంచి వచ్చిన తల్లి శ్రీలక్ష్మి మెట్ల పక్కన చున్నీకి వేలాడుతున్న కొడుకుని చూసి గుండె పట్టుకుంది. కత్తిపీటతో చీరను కట్ చేసి బాలుడిని కిందకు దించింది.కార్టూన్లు చూడడమంటే ఆ బాలుడికి సరదా. ఎప్పుడు టీవీ ఆన్ చేసినా కార్టూన్ ఛానల్ కు అతుక్కుపోయేవాడు. సెల్ ఫోన్ ఇచ్చినా అందులోను కార్టూన్లే చూసేవాడు. ఆయా కార్టూన్లలో ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఆడుకునేవాడు. గతంలోనూ ఓసారి మంచానికి తాడు వేసుకొని బిగించుకోవాలని చూశాడు. అంతేకాదు చనిపోయే ఆట ఆడుకుంటానంటూ తల్లితో కూడా చెప్పేవాడు. ఆందోళన చెందిన తల్లి పలుమార్లు మందలించింది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఆ బాలుడు మెడకు బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు. మిగతాజీవిగా తాడుకు వేలాడుతున్న బాలుడుని చూసి తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. విశాఖలో జరిగిన ఈ విషాదం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.కైలాస పురం కస్తూరి నగర్ లో విషాదం చోటు చేసుకుంది. పైడా శ్రీనివాసరావు ఎలక్ట్రిషన్, భార్య లక్ష్మి ఎనిమిదేళ్ల బాలుడి డింపుల్ సూర్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలుడు… ఆడుకుంటుండగా తాడు మెడకు బిగుసుకుని బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు డింపుల్ సూర్య. కిటికీ పైనున్న ఎలక్ట్రిక్ పైపుకు ఉన్న తాడు బాలుడి మెడకు బిగుసుకున్నట్టు గుర్తించారు.
అనుమానాస్పద మృతి..
అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహం మార్చురీకి తరలించారు. దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక.. స్కూల్ బ్యాగ్ ఇంట్లో పెట్టి.. ఓ చున్ని తీసుకొని వరండాలో ఆడుకుంటున్నాడు. తల్లి లోపల గదిలో టీవీ చూస్తూ ఉంది. తండ్రి శ్రీనివాసరావు ఇంట్లో లేడు. అటుగా వెళుతున్న ఓ మహిళ పెద్ద కేకలు వేసింది. దీంతో లోపల నుంచి వచ్చిన తల్లి శ్రీలక్ష్మి మెట్ల పక్కన చున్నీకి వేలాడుతున్న కొడుకుని చూసి గుండె పట్టుకుంది. కత్తిపీటతో చీరను కట్ చేసి బాలుడిని కిందకు దించింది. హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. డింపుల్ సూర్య ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు దృవీకరించారు. ఎలక్ట్రికల్ పైపు నుంచి కిందకు చున్నితో జారిపడి మెడకు బిగుసుకుని ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ తో ఆధారాలను సేకరించారు.గతంలోనూ ఓసారి ప్రయత్నం చేసిన చిన్నారి
డింపుల్ సూర్య కు కార్టూన్ అంటే చాలా ఇష్టం. టీవీల్లో సెల్ ఫోన్లో కార్టూన్లే ఎక్కువగా చూసేవాడు. ఆటాడుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు అంటున్నారు కుటుంబ సభ్యులు. కార్టూన్లు ఎక్కువగా సూర్య చూసేవాడని తండ్రి శ్రీనివాసరావు అంటున్నాడు. గతంలోనూ ఓసారి మంచానికి తాడు చుట్టి.. దానితో తన మెడకు బిగించుకునేందుకు యత్నంచగా.. సకాలంలో గుర్తించారు. చనిపోయే ఆట ఆడుకుంటానంటూ తరచూ చెప్పడంతో గతంలోని తల్లి మందలించిందని బంధువులు అంటున్నారు.
డింపుల్ సూర్య మృతితో కస్తూరి నగర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తండ్రి ఎలక్ట్రిషన్. ఒకగానొక్క కొడుకు. ఇలా ప్రాణాల కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతొంది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. పోస్టుమార్టం పూర్తయ్యాక సీన్ ఆఫ్ ఆఫీసులో దొరికిన ఆధారాలను క్రోడీకరించి డింపుల్ సూర్య మృతిపై పోలీసులు ఓ కంక్లూజన్ కి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా.. కళ్ల ముందు ఎప్పుడూ ఆడుకునే డింపుల్ సూర్య ఒక్కసారిగా విగత జీవిగా మారిపోవడం ఆ కుటుంబానికి తీరని లోకాన్ని మిగిల్చింది.