Best Investment Options: ఈ పథకాలలో పెట్టుబడి పెడితే.. ఊహించని విధంగా రాబడి..ఇటీవల చదువు పూర్తయ్యి ఉద్యోగం సాధించారా? ఇప్పటి నుంచే డబ్బు ఆదా చేయాలని, మంచి పథకాలలో పెట్టుబడి ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మిస్ అవ్వొద్దు. కొత్తగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన వారు మొదటి నెల నుంచే పొదుపు మార్గంలో ప్రయాణించడం మేలైన విధానం. ఎంత త్వరగా మంచి పథకాలను ఎంపిక చేసుకొని పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే మెచ్యూరిటీ లేదా రిటైర్ మెంట్ సమయానికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు రిటర్న్ పొందొచ్చు. ఈ నేపథ్యంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకొనే వారికి అందుబాటులో ఉన్న బెస్ట్ ఇన్ వెస్ట్ మెంట్ స్కీమ్ లను మీకు పరిచయం చేస్తున్నాం. ఓ లుక్కేయండి.ఫిక్స్డ్ డిపాజిట్లు..
మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా స్థిరమైన రాబడి రావాలనుకొనే వారికి ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు బెస్ట్ ఆప్షన్. తాతల కాలం నుంచి ఇప్పటి వరకూ ఈ పథకానికి ఆదరణ ఉంది. దీనిలో పెట్టుబడి సురక్షితంగా ఉండటంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీనిలో కుమ్యూలేటివ్, నాన్ కుమ్యూలేటివ్ ఎఫ్ డీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. కుమ్యూలేటివ్ ఎఫ్డీ అయితే మెచ్యూరిటీ సమయానికి అధిక మొత్తంలో నగదును అందిస్తాయి. నాన్ కుమ్యూలేటివ్ అయితే పీరియాడికల్ ఇన్ కమ్ ని అందిస్తుంది. ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ ని ష్యూరిటీగా మీరు లోన్ కూడా తీసుకోవచ్చు.
రికరింగ్ డిపాజిట్లు..
రికరింగ్ డిపాజిట్లు కొంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటాయి. అయితే ఎఫ్డీల మాదిరిగా ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. నిర్ధిష్ట కాల వ్యవధితో పెట్టుబడి పెట్టొచ్చు. మీ అవసరాలకు అనుగుణంగా కాలానుగుణంగా పెట్టుబడి పెట్టండి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)..
ఎస్ఐపీలు కొంతవరకు రికరింగ్ డిపాజిట్లను పోలి ఉంటాయి. కానీ కొంచెం ఎక్కువ మార్కెట్ రిస్క్ ఉంటుంది. దీనిలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని ముందే నిర్ధారించుకొని దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఎంపిక చేసుకొని పెట్టుబడి పెట్టాలి. మీరు ముందుగానే ప్రారంభించి, క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, మీ పెట్టుబడులకు గరిష్ట రాబడి వస్తుంది.
బంగారంలో పెట్టుబడులు..
మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా, బంగారంపై పెట్టుబడి ఎవర్ గ్రీన్ గానే ఉంటుంది. మీరు సమాజంలో మరింత ఆమోదయోగ్యమైన, కొంత మంచి రాబడిని కలిగి ఉండే పెట్టుబడిని కోరుకుంటే, బంగారం మీకు ఉత్తమ పెట్టుబడి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వ-మద్దతుగల పెట్టుబడి ఎంపిక, ఇది కాలక్రమేణా మీ డబ్బును పెంచుకోవడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గం. దీనిలో పెట్టుబడిపై కూడా మీకు అధిక రాబడితో పాటు పలు ప్రయోజనాలు కూడా పొందుతారు.