Chandrababu Arrest: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది, జైల్లో ఉంచడం సరికాదు.. న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు..Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు పలు అభియోగాలను మోపారు. చంద్రబాబు అరెస్టు అనంతరం బెయిల్ పిటిషన్ పై సీబీఐ ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరుపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు పలు అభియోగాలను మోపారు. చంద్రబాబు అరెస్టు అనంతరం బెయిల్ పిటిషన్ పై సీబీఐ ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరుపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదోపవాదాలను విన్న ధర్మాసనం.. చంద్రబాబుకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, చంద్రబాబు, సీఐడీ వేసిన పిటీషన్లపై ఏసీబీ కోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. రిమాండ్ కాకుండా హౌస్ అరెస్ట్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. చంద్రబాబును 4 రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ వేశారు వీటిపై విచారణ జరగనుంది. నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. జైల్లో ఉంచడం సరికాదంటూ వ్యాఖ్యానించారు.చంద్రబాబుకు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా పేర్కొన్నారు. హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తమ వాదనలు వినిపిస్తామని.. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేయలేదు లూథ్రా తెలిపారు. లూథ్రా వ్యాఖ్యల అనంతరం ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అదే సమయంలో పోలీస్ కస్టడీకు ఏసీబీ కోర్టు అనుమతిస్తుందో లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు: ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు..
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కావాలనే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌పై టీడీపీ, జనసేన నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విశాఖలో గవర్నర్‌ను కలిసిన టీడీపీ, జనసేన నేతలు.. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌పై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారని మీడియాకు వెల్లడించారు అచ్చెన్నాయుడు. తనకు తెలియకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని గవర్నర్ చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ బలపడుతుందని గ్రహించి, పక్కా ప్లాన్ ప్రకారమే చంద్రబాబును అరెస్టు చేశారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోపించారు.