Swappable Battery Bikes: రెండు బ్యాటరీలు కలిగిన బెస్ట్ స్కూటర్లు ఇవే.. ఒకటి చార్జింగ్ అయిపోతే మరొకటి.. ఇబ్బందే ఉండదు..
కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీలతో కూడిన స్కూటర్లు, బైక్ లను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీని కంపెనీలు ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నాయి. స్వాపబుల్ బ్యాటరీ అంటే మార్చుకోదగిన బ్యాటరీలు అన్నమాట.
ఇటీవల భారతీయ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు అధికంగా జరుగుతున్నాయి. కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీలతో కూడిన స్కూటర్లు, బైక్ లను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీని కంపెనీలు ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నాయి. స్వాపబుల్ బ్యాటరీ అంటే మార్చుకోదగిన బ్యాటరీలు అన్నమాట. అంటే ఒక బ్యాటరీ చార్జింగ్ అయిపోయినప్పుడు, దాని స్థానంలో మరొకటి పెట్టుకొని వెళ్లపోవచ్చన్నమాట. ఈ టెక్నాలజీతో కూడిన స్కూటర్లు మన దేశంలో కూడా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..హోండా ఈఎం1..
హోండా కంపెనీ నుంచి 2024 నాటికి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మన దేశంలో లాంచ్ కానున్నాయి. వాటిల్లో ఒకటి ఫిక్స్ డ్ బ్యాటరీ కాగా.. మరొకటి స్వాపబుల్ బ్యాటరీతో వస్తుంది. స్వాపబుల్ బ్యాటరీతో వస్తున్న స్కూటర్ ఈఎం1. ఇది గరిష్టంగా సింగిల్ చార్జ్ పై 48కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ ఇంకా విడుదల చేయలేదు.
సుజుకీ ఈ బుర్గ్ మన్..
ఈ స్కూటర్ ని టోక్యోలోని జోనాన్ లో కంపెనీ పరీక్షిస్తోంది. త్వరలోనే భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో కూడా స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీని కంపెనీ వినియోగిస్తోంది. ఇది గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 44కిమీల మైలేజీని అందిస్తుంది.
బాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్..
న్యూ ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ బాజ్ బైక్స్ గిగ్ స్వాపబుల్ బ్యాటరీతో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర బ్యాటరీ లేకుండా రూ. 35,000 ఎక్స్ షోరూం ఢిల్లీ గా ఉంది. ఇది ఆటోమేటెడ్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్, ఫ్లీట్ మేనేజ్మెంట్ టూల్స్‌తో వస్తుంది. బ్యాటరీలు ఏఐఎస్ 156 ప్రమాణం ద్వారా సిఫార్సుతో కూడిన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. బ్యాటరీలకు ఐపీ 68 రేటింగ్ కూడా ఉంది. బ్యాటరీలు వాటర్‌ప్రూఫ్ షాక్‌ప్రూఫ్‌గా ఉంటాయి.