Japan Moon Sniper Mission takes off, landing in four to six months
Moon Mission: మూన్ మిషన్ చేపట్టిన జపాన్.. భారత్ చంద్రయాన్ 3 సక్సెస్తో పోలుస్తున్న ప్రపంచ దేశాలు..జపాన్ మూన్ మిషన్ ను చేపట్టింది.. సాఫ్ట్ ల్యాండ్ ఇన్ మూన్ (SLIM) మిషన్ గురువారం ఉదయం మొదలైంది.. అయితే చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు ఇంకా నాలుగు నెలల సమయం పడుతుంది.. గతంలో నాసా నాలుగు రోజుల్లో చంద్రుడిపై చేరుకుంది.. భారత్ చేపట్టిన చంద్రయాన్ 3 నలభై రోజులకు చేరుకుంటే ఇపుడు జపాన్ మూన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి పైకి చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పడుతుంది.చంద్రుడిపై పరిశోధనల కోసం అనేక దేశాలు క్యూ కడుతున్నాయి.. దశాబ్దాల క్రితమే చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టిన అమెరికా, రష్యా, జపాన్ దేశాల దృష్టి మళ్లీ చంద్రుడిపై పడింది. భారత్ ఇప్పటికే చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టి ప్రపంచానికి కొత్త విషయాలను వెల్లడించింది. చంద్రయాన్ 1 ప్రయోగం తర్వాతనే చంద్రుడిపై నీటి జాడ ఉన్నట్లు గుర్తించింది. చంద్రయాన్ 2 అనుకున్నంత సక్సెస్ కాకపోయినా ఆర్బిటర్ పని తీరు ఇప్పటికి కూడా బాగుంది.. ఇక చంద్రయాన్ 3 సక్సెస్ గురించి ప్రపంచ దేశాలు సైతం అభినందిస్తున్నాయి.. భారత్ చేపట్టిన చంద్రాయన్ 3 తర్వాత రష్యా మూన్ మిషన్ చేపట్టింది. చంద్రయాన్ 3 ప్రయాణం 40 రోజులు అయితే రష్యా చేపట్టిన లూనార్ 25 సమయం కేవలం 11 రోజులు మాత్రమే.. అయితే అనుకున్నట్లుగా సాఫ్ట్ ల్యాండ్ కాకుండా క్రాష్ ల్యాండ్ అయ్యింది.. ఆ తర్వాత అనుకున్న సమయానికి చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండ్ కావడం మాత్రమే కాదు.. అంతకు మించిన ఫెర్ఫామెన్స్ తో ఆదరగొట్టింది..
ఇపుడు జపాన్ మూన్ మిషన్ ను చేపట్టింది.. సాఫ్ట్ ల్యాండ్ ఇన్ మూన్ (SLIM) మిషన్ గురువారం ఉదయం మొదలైంది.. అయితే చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు ఇంకా నాలుగు నెలల సమయం పడుతుంది.. గతంలో నాసా నాలుగు రోజుల్లో చంద్రుడిపై చేరుకుంది.. భారత్ చేపట్టిన చంద్రయాన్ 3 నలభై రోజులకు చేరుకుంటే ఇపుడు జపాన్ మూన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి పైకి చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పడుతుంది. గతంలో చంద్రయాన్ 3 ఆలస్యంపై చాలామంది చర్చ జరిపారు.. కానీ ఖర్చును తగ్గించడమే ఉద్దేశంగా ప్రయాణ సమయాన్ని పెంచింది ఇస్రో.. ఇపుడు జపాన్ కూడా అదే ఫార్ములాను అనుసరిస్తూ ఇంకాస్త ఆలస్యంగా చంద్రుడి పైకి స్పేస్ క్రాఫ్ట్ ను తీసుకెళుతుంది.
ఇందులో చంద్రయాన్ 2 లో ఆర్బిటర్, చంద్రయాన్ 3 లో ప్రొఫెల్షన్ మాడ్యులర్ తరహాలో ఎలాంటి మాడ్యులర్ లేవు.. భూ స్థిర కక్ష్య నుంచి బూస్టింగ్ త్రో పద్దతిలో చంద్రుడి వైపు వెళ్లేలా రూపొందించారు.. అలాగే రోవర్ స్థానంలో వినూత్నమైన పరిశోధన పరికరాలు (పేలోడ్స్) పొందుపరిచారు. ఇవి సాఫ్ట్ ల్యాండ్ అయ్యే ప్రాంతాన్ని వాటంతట అవే గుర్తించి అనువైన చోట ల్యాండ్ అవుతాయి. అందులోని పరికరాలు అక్కడి ఉపరితలంపై ఉన్న పరిస్థితిని బట్టి వాటి రూపాన్ని మార్చుకుని పరిశోధన చేస్తాయని జపాన్ అంతరిక పరిశోధన కేంద్రం ప్రకటించింది.చంద్రుడిపై ప్రయోగం కోసం జపాన్ మూన్ మిషన్ దక్షిణ ధ్రువంపై కాకుండా మరో ధ్రువంపై చేస్తోంది. జపాన్ మొదలు పెట్టిన ఈ మిషన్ నెల క్రితమే జరగాల్సి ఉంది. సాంకేతిక సమస్యలు, అంతరిక్షంలో ఉండే మార్పుల కారణంగా మూడు సార్లు వాయిదా పడి నాలుగోసారి ప్రయోగం చేపట్టింది. చంద్రయాన్ పేరుతో వరుస ప్రయోగలతో ప్రపంచానికి కొత్త విషయాలను భారత్ తెలిపింది. ఇక జపాన్ ప్రయోగ ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఉండగా.. ఖర్చు విషయంలో భారత్ ని జపాన్ ఫాలో అవుతోంది అన్న చర్చ జరుగుతోంది.