Telangana: భారీగా పెరుగుతున్న డెంగీ కేసులు.. ఆ జిల్లాలో ఒక్కరోజే 14 కేసులుతెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జులై చివరి నాటికి 961 కేసులు నమోదయ్యాయి. అయితే ఆగస్టు నెలలో మాత్రం 200కి పైగా వచ్చాయి. అయితే తాజాగా కురిసినటువంటి వర్షాల వల్ల రాబోయే రోజుల్లో కూడా డెంగీ కేసులు మరంతగా పెరుగుతాయని.. వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కూడా భారీగానే ఉన్నారు. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య ఇంకా ఎక్కవగానే ఉంటారని అంచనా వేస్తోంది.తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జులై చివరి నాటికి 961 కేసులు నమోదయ్యాయి. అయితే ఆగస్టు నెలలో మాత్రం 200కి పైగా వచ్చాయి. అయితే తాజాగా కురిసినటువంటి వర్షాల వల్ల రాబోయే రోజుల్లో కూడా డెంగీ కేసులు మరంతగా పెరుగుతాయని.. వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కూడా భారీగానే ఉన్నారు. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య ఇంకా ఎక్కవగానే ఉంటారని అంచనా వేస్తోంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూసుకుంటే ఈ ఏడాది ఇప్పటిదాకా 168 కేసులు నమోదయ్యాయి. అలాగే అక్కడ ప్రైవేటు ఆసుపత్రులకు తూడా తాకిడి ఎక్కువగానే ఉంటోంది. ఖమ్మం జిల్లాలోని ఆగస్టు నెలలో 61 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు.అయితే ఈ జిల్లాలో గత ఐదు రోజుల్లోనే 23 కేసుల వరకు నమోదయ్యాయి. తాజాగా బుధవారం రోజున ఖమ్మం జిల్లాలో ఒక్కరోజే 14 కేసులు వచ్చాయి. అయితే ముందు ముందు కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేసినట్లు ఏజెన్సీతో ముడిపడి ఉన్న డీఎంహెచ్వో పేర్కొన్నారు. తాజాగా కురిసిన వర్షాల వల్ల ఈ నెల మూడోవారం నుంచి ఈ డెంగీ తీవ్రత మరింత ఎక్కువ కావచ్చని తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ చనిపోయాడు. అయితే అతను డెంగీ లక్షణాలతోనే మృతి చెందినట్లు కుటంబీకులు చెప్పారు. అయితే డెంగీ లక్షణాలు వస్తే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్లు, కండరాలు, కీళ్ల నొప్పులు ఉండటం.. రుచి కోల్పోవడం, జలుబు, వాంతులు వంటివి డెంగీ లక్షణాలని అంటున్నారు.
డెంగీ వచ్చిన తర్వాత ఇబ్బంది పడటం కన్నా కూడా దాని గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే దోమలు కుట్టకుండా ఉండేందుకు.. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. డెంగీని ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా నయం కావడమే కాకుండా తక్కువ ఖర్చుతో బయటపడే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ ఇది ముదిరితే.. ప్లేట్లెట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయి ప్రాణాంతకంగా మారుతుందని చెప్పారు. ఆసుపత్రులకు వెళ్తున్న వారిలో లక్షణాలను బట్టి డెంగీ పరీక్షలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారిలో ఈ వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూసుకుంటే అవుట్పేషెంట్లతో పాటు ఇన్పేషంట్ల సంఖ్య ఎక్కవగా పెరిగిపోయింది. అయితే ఇది ఇటీవలే 25 నుంచి 30 శాతం వరకు ఓపీ పెరిగినట్లు అధికారులు చెప్పారు.