Chandrababu Naidu facing IT notices and CID investigation, Will TDP have problems with cases during elections
Chandrababu Naidu: చంద్రబాబు వ్యాఖ్యల వెనుక అర్ధమేంటి..? ఎన్నికల సమయంలో టీడీపీకి ఇబ్బందులు తప్పవా..ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల వ్యవహారం రోజురోజుకూ ముదురుతుంది. లెక్కల్లో చూపని నగదుగా ఉన్న 118 కోట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసారు. ఆగస్ట్ నాలుగో తేదీన హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసం అడ్రస్‌తో ఈ నోటీసులు పంపించారు. ఇటీవల ఈ విషయం జాతీయ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు ఆయుధంగా మలుచుకుంది.ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల వ్యవహారం రోజురోజుకూ ముదురుతుంది. లెక్కల్లో చూపని నగదుగా ఉన్న 118 కోట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసారు. ఆగస్ట్ నాలుగో తేదీన హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసం అడ్రస్‌తో ఈ నోటీసులు పంపించారు. ఇటీవల ఈ విషయం జాతీయ మీడియా ద్వారా బయటకు పొక్కడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు ఆయుధంగా మలుచుకుంది. మొదటి నుంచి రాజధాని విషయంలో అక్రమాలు జరిగాయని, అసైన్డ్ ల్యాండ్స్ వ్యవహారంలో కూడా భారీ స్కాం జరిగిందనేది వైసీపీ ఆరోపణ. ఇప్పటికే ఆయా కేసులకు సంబంధించి చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలపై హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. దీంతో చంద్రబాబు అవినీతి అంశంపై నోరు మెదపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఐటీ నోటీసులుపై చంద్రబాబు మౌనం వీడాలంటున్నారు వైసీపీ నేతలు.. కొంతకాలంగా ఇదే అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి మరీ చంద్రబాబు అవినీతి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే, ముడుపుల కేసులకు సంబంధించి ఐటీ నోటీసుల వ్యవహారంలో కీలకమైన మనోజ్ వాసుదేవ్ పార్దసానికి ఇతర స్కాంల్లో నిందితులకు దగ్గరి సంబంధాలున్నట్లు గుర్తించింది సీఐడి. దీంతో మనోజ్ వాసుదేవ్‌తో పాటు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాలకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న ఐటీ నోటీసులకు తోడు ఈ ఇద్దరికీ సిఐడీ నోటీసులు జారీ చేయడంతో చంద్రబాబుకు సమస్యలు చుట్టుకుంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తనను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చంటూ వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.
స్కాంలు ఏవైనా మూలాలు ఒకటే అంటున్న ప్రభుత్వం..
గత తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలో అనేక స్కాంలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు పలు స్కాంలకు సంబంధించి సిట్ విచారణ, సీఐడీ విచారణలు కూడా కొనసాగుతున్నాయి. చంద్రబాబు హయాంలో రాజధాని అసైన్డ్ ల్యాండ్స్ స్కాంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాంలలో భారీ అవనీతి జరిగిందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి కొంతమంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసింది సీఐడీ. ఇక ఫైబర్ నెట్ స్కాంపైనా విచారణ కొనసాగుతూ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బోగస్ కంపెనీలను చూపించి ప్రజా ధనం సొంత ఖాతాల్లోకి తరలించుకున్నారనే అభియోగాలు మోపింది సీఐడి. ఇదే రీతిలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలోనూ భారీగా అవినీతి జరిగిందనేది ఆరోపణ. అయితే, స్కిల్ డెవలప్ మెంట్ స్కాం,ముడుపుల స్కాంలకు మూలం ఒకేచోట ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతుంది. దీంతో ఐటీ నోటీసుల వ్యవహారంలో ఇన్వాల్వ్ కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి రెండు స్కామ్‌లలో కూడా ఒకే వ్యక్తులు ఉండటం, ఏ రకంగా ముడుపులు అందాయనే దానిపై పూర్తి విచారణకు సీఐడీ సిద్దమైంది. రెండు స్కాంలలో కూడా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన వద్ద పీఏగా పనిచేసిన శ్రీనివాసరావుకు నగదు అందిందని ఆరోపణలు చేస్తోంది సీఐడి. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి ప్రతి కంపెనీ నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలతో ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. స్కిల్ స్కాం కూడా ఇదే తరహాలో జరిగింది. దీంతో మనోజ్ వాసుదేవ్ పార్దసాని, స్కిల్‌స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాలకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ ఇద్దరినీ త్వరలోనే విచారించనున్నారు సీఐడీ అధికారులు. ఇక దుబాయ్‌లోనూ చంద్రబాబు డబ్బు అందుకున్నట్టుగా అభియోగాలు ఉండటంతో త్వరలో దుబాయ్ కు సీఐడీ అధికారులు వెళ్లి విచారణ చేపడతారని తెలుస్తోంది. అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ వ్యవహారంలో గుంభనంగా వ్యవహరిస్తుంది. నాలుగేళ్లుగా స్కాంల పేరుతో ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని చెప్పుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇసుక అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు తప్ప.. తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతుంది.
ఎన్నికల సమయంలో కేసులతో టీడీపీకి ఇబ్బందులు తప్పవా..?
ఇప్పటికే అనేక ఆరోపణలతో కేసులు, విచారణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సమయంలో కష్టాలు తప్పవనే వాదన వినిపిస్తుంది. ఐటీ నోటీసుల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో వదిలిపెట్టేలా కనబడటం లేదు. రూ.118 కోట్ల నగదుకు సంబంధించి హవాలా రూపంలో ముడుపులు అందుకున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఇక స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు లింక్ పెట్టి ముడుపుల కేసును కూడా విచారించాలని సీఐడి నిర్ణయం తీసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగానే చెప్పవచ్చంటున్నారు రాజకీయ నేతలు.. కేసులో ఏం జరిగిందనే విషయం తేల్చడానికి కొంత సమయం పట్టినా.. ఎన్నికల ప్రచారంలో వైసీపీ మాత్రం అవినీతి అంశాన్ని ప్రచారాస్త్రాలుగా మార్చుకునే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా అధిగమిస్తుందనేది చూడాలి.