WTC Final: టీమిండియా ఫ్లాప్ షోకి కారణం ఐపీఎల్.. ఒక్కరికీ గెలవాలనే కసిలేదంటూ నెటిజన్ల ఫైర్..
IND vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనకు ఐపీఎల్ కారణమని సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు. దీంతో బీసీసీఐతో పాటు భారత జట్టుపై అభిమానులు నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. భారత ఆటగాళ్లను చూస్తుంటే.. అసలు మ్యాచ్ గెలవాలనే మనస్తత్వం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఓవల్ మైదానంలో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. కంగారూల తరపున ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీలు చేశారు. అదే సమయంలో ఆస్ట్రేలియా చేసిన 469 పరుగులకు సమాధానంగా టీమిండియా వార్తలు రాసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 234 పరుగులతో ఆడుతోంది. భారత్ తరపున అజింక్యా రహానే 71, శార్దూల్ ఠాకూర్ 30 క్రీజులో ఉన్నారు.బీసీసీఐ, టీం ఇండియా ఆటగాళ్లపై అభిమానులు ఆగ్రహం..
ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనకు ఐపీఎల్ కారణమని సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు. దీంతో బీసీసీఐతో పాటు భారత జట్టుపై అభిమానులు నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. భారత ఆటగాళ్లను చూస్తుంటే.. అసలు మ్యాచ్ గెలవాలనే మనస్తత్వం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ను చాలా లైట్‌గా తీసుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారు.